భూ వివాదాల్లో తలదూర్చకండి -వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్

0
155
warangal police commissioner P Pramod Kumar
Spread the love

పోలీస్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోను భూ వివాదాల్లో తలదూర్చవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల పనితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు పోలీసులు మరింత దగ్గరయ్యేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పోలీస్ ఆధికారులకు పలుసూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా స్టేషన్కి వచ్చే సివిల్ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూనే వీలైనంత వరకు సివిల్ మరియు భూ వివాదాలకు పోలీసు అధికారులు దూరంగా వుండాల్సి వుంటుందని, ఒక వేళ ఇలాంటి భూ తగాదాల్లో పోలీసు అధికారులు తలదూర్చితే చిక్కుల్లో పడుతారని, ఈ సమస్యల నుండి మిమ్మల్ని అధికారులు తప్పించినా  కోర్టు నుండి తప్పించుకోలేరని, ఇది గుర్తించి అధికారులు భూ తగాదాల జోలికి పోవడం మానుకోవాలని, ఒక వేళ ఎదైనా భూ సమస్యకు సంబంధించి ఫిర్యాదులు వస్తే వాటిని ఇరువర్గాల వారు వీలైనంత వరకు కోర్టులో పరిష్కరించుకోవాలని, ఫిర్యాదుదారులు పోలీసు అధికారులకు సూచించాల్సి వుంటుందని, అదే విధంగా ఈ భూ తగాదాలకు సంబంధించి, ఇరువర్గాల మధ్య ఎదైనా శాంతి భద్రతలకు సంబంధించి సమస్య తలెత్తినప్పుడు నేరానికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోని బైండోవర్ చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ముఖ్యంగా భూ తగాదాల్లో మధ్యవర్తిత్వం చేసే రౌడీ షీటర్ల పట్ల అధికారులు కఠినంగా వ్యహరించాల్సి వుంటుందని, ఆలాగే ఇలాంటి చట్ట వ్యతిరేఖ చర్యలకు పాల్పడే రౌడీ షీటర్లపై పి.డి యాక్ట్ క్రింద కేసులను నమోదు చేయడం జరుగుతుందని రౌడీషీటర్లను హెచ్చరించాలని, ముఖ్యంగా భూ సమస్యలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులను, రౌడీ షీటర్లను  స్టేషన్ వారిగా గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని, ప్రధానంగా నకీలీ దస్తావేజులతో భూ కజ్జాలకు పాల్పడుతున్న నకిలీ దస్తావేజులను తయారు చేసే వ్యక్తులను సైతం పోలీస్ ఆధికారులు గుర్తించాల్సిన అవసరం వుందని, గతంలో ఇలాంటి నకిలీ దస్తావేజుల తయారీకి పాల్పడిన వ్యక్తులతో పాటు, ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి దస్తావేజుల తయారీకి పాల్పడుతున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆరా తీయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here