జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. C. నారాయణ రెడ్డి జయంతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి

0
84
Spread the love

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. C. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… డా. C. నారాయణ రెడ్డి గారు తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కవి అని అన్నారు. సీఎం కేసీఆర్ గారికి సినారె గారి రచనలు అంటే ఎంతో ఇష్టం అన్నారు. వారి రచనలు సీఎం కేసీఆర్ గారిపై ఎంతో ప్రభావితం చేసాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్వయంగా కవి, సాహితీ వేత్త అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారన్నారు. తెలంగాణ కు చెందిన వైతాళికుల, కవుల, సాహితీ వేత్తల, సామజిక వేత్తల జయంతి, వర్ధంతి లను సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. డా. సినారె గారి జ్ఞాపకార్ధం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఎంతో విలువైన ప్రాంతంలో సినారె సాహిత్య సారస్వత సదనం ను నిర్మిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సాహితీ వేత్త KP అశోక్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here