హుడా అధికారుల నిర్లక్ష్యంతో 14 ఏళ్లుగా ఇబ్బందులు

0
90
Spread the love

ఇళ్ళు నిర్మించుకుందామని గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసి కూడబెట్టుకున్న డబ్బులతో పుప్పాలగూడా లో ప్లాట్లు కొనుక్కుంటే హుడా అధికారుల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడా లో అజైల్ బిల్డ్కాన్ హుడా అనుమతితో చేసిన లేఅవుట్ లో ప్లాట్లు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొనుగోలుదారులు డాక్టర్ రషీద్ తదితరులు శనివారంనాడు హైదరాబాద్ లోని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని విషయాలు పరిశీలించకుండా మొత్తం ఎన్నిఎకరాలు ఉందో సరిగ్గా తెలుసుకోకుండా తిరుమల లేఅవుట్ కు అనుమతులు ఇచ్చారని, హుడాకు కేటాయించాల్సిన పార్క్ స్థలం కేటాయించకుండానే అనుమతులు ఇచ్చారని డాక్టర్ రషీద్ ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్న అజైల్ లేఅవుట్ లోని మేము కొనుక్కున్న ప్లాట్లలో పార్క్ స్థలం ఉందని తిరుమల లేఅవుట్ లో ఇళ్ళు కట్టుకొని సొసైటీ ఏర్పాటు చేసుకున్నవారు ధర్నాలు చేస్తున్నారని. పూర్తి వివరాలు తెలియక కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా వారికి మద్దతు ఇస్తున్నారని డాక్టర్ రషీద్ చెప్పారు. హైకోర్టులో కేసు నడుస్తున్నదని కోర్టు స్టేటస్కో ఆదేశాలు ఇచ్చిందని. కోర్టు ఆదేశాలు సంబంధిత పోలీసు అధికారులకు, మణికొండ మున్సిపల్ కమిషనర్ కు సంబంధిత పత్రాలు అందచేశామని, తమ ప్లాట్లలోకి వచ్చి పార్కు అంటూ ఇబ్బందులు కలిపిస్తున్నవారిపై ఫిర్యాదు చేశామని డాక్టర్ రషీద్ తదితరులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here