కొవిడ్‌కు కొత్త మెడిసిన్: డీఆర్డీవో చీఫ్ సతీష్‌రెడ్డి

0
167
Spread the love

కొవిడ్‌కు కొత్త మెడిసిన్: డీఆర్డీవో చీఫ్ సతీష్‌రెడ్డి

హైదరాబాద్: కొవిడ్‌కు కొత్త మెడిసిన్ అభివృద్ధి చేశామని డీఆర్డీవో చీఫ్ సతీష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్‌పై పోరులో 2-డీజీ మెడిసిన్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. కృత్రిమ ఆక్సిజన్ అవసరాన్ని 2-డీజీ మెడిసిన్ తగ్గిస్తుందన్నారు. రెడ్డీస్ ల్యాబ్స్‌తో కలిసి 2-డీజీ మెడిసిన్ రూపొందించినట్లు వివరించారు. మొదటగా హైదరాబాద్‌ సీసీఎంబీలో ప్రయోగించి చూశామని చెప్పారు. జనరల్ మెటీరియల్‌తోనే పౌడర్ రూపంలో మెడిసిన్ తయారీ ఉంటుందని ప్రకటించారు. ఈ ఔషధం పూర్తి సురక్షితమని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని స్పష్టం చేశారు. త్వరలో తేలికపాటి ఆక్సిజన్ సిలిండర్ల ఆవిష్కరణ ఉంటుందని డీఆర్డీవో చీఫ్ సతీష్‌రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here