ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు

0
208
Spread the love

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు

అమరావతి జూన్ 1 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ( ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆర్టీసీ ఎండీగా పనిచేసిన ఆర్‌పీ ఠాకూర్ నిన్న పదవీ విరమణ చేయడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం ఆయన స్థానంలో నియమించింది.1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. గతంలో విజయవాడ సీపీగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తనకు గురుతర బాధ్యతలు అప్పగించిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేస్తానని అన్నారు. సంస్థను లాభాల బాటలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here