గ్రామ పంచాయతీ ఎన్నికల పై సిద్ధిపేట‌లో స‌మీక్ష నిర్వ‌హించిన‌ ఎన్నికల కమిషనర్‌

0
617
Spread the love

గ్రామ పంచాయతీ ఎన్నికల పై సిద్ధిపేట‌లో స‌మీక్ష నిర్వ‌హించిన‌ ఎన్నికల కమిషనర్‌

గ్రామ పంచాయతీ ఎన్నికల పై సిద్ధిపేట‌లో స‌మీక్ష నిర్వ‌హించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి. సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఈ రోజు సిద్దిపేట‌లో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృష్ణ భాస్క‌ర్ ఆయ‌న‌కు పుష్ప‌గుచ్ఛం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. పోలీసులు ఆయ‌న‌కు గౌర‌వ వంద‌నం చేశారు. రెండవ విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి….. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ , జాయింట్ కలెక్టర్ పద్మాకర్ , డి.ఆర్.ఓ చంద్ర శేఖర్ లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ నాగిరెడ్డికి వివరించారు . కలెక్టర్ కృష్ణ భాస్కర్ ని ఎన్నికల కమిషనర్‌ ప్ర‌త్యేకంగా అభ‌నందించారు. ఎన్నికల నిర్వహణలో ప్రణాళిక ప్రకారం జిల్లాలో జ‌రుగుతున్న‌ ఏర్పాట్లపై నాగిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇదేవిధంగా ముందుకు వెళ్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. రెండవ విడత గ్రామపంచాయితి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఎన్నికల సందర్భంలో సంక్రాంతి పండగ కూడా రావటం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు జిల్లా అధికారులకు పలు ఆదేశాలు జారీచేసిన ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి. ప్రెసిడింగ్ అధికారులు ,అసిస్టెంట్ ప్రెసిడింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని శిక్షణ కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించాలని నాగిరెడ్డి సూచించటం జరిగింది. సెలవుల దినాల్లో సైతం విధుల్లో ఉంటూ ఎన్నికలను విజయ వంతంగా నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా జిల్లలో ఎన్నికలకు బ్యాలెట్ పేపర్స్ సరఫరా చేయడానికి , పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను, పోలింగ్ పర్సన్స్, ఎన్నికల సామాగ్రీ , అబ్సర్వర్స్ , మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ , ఎన్నికల నిర్వహణకు కావలసిన వాహన సదుపాయాలు , కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లపై రూపొందించిన ప్రణాళికను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ నాగిరెడ్డికి వివరించారు. ఎన్నికల నియమ నిబంధ‌నలను ప్రతి ఒక్క ఒక్క‌రికి అవగాహన కలిగే విధంగా అధికారులకు త‌ర్ఫీదు నిచ్చామ‌ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి కి కృష్ణ భాస్కర్ తీసుకుక‌వ‌చ్చారు.

Watch Nagi Reddy, Election Commissioner Review meeting at Siddipet on Panchayati Elections Video below.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here