విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై తెలంగాణ ఎస్ఈసీ నిషేధం

0
107
Spread the love

విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై తెలంగాణ ఎస్ఈసీ నిషేధం

హైద‌రాబాద్ ఏప్రిల్ 28 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: క‌రోనా మ‌హమ్మారి తీవ్ర‌త దృష్ట్యా రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ర్టంలో మే 3వ తేదీన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు త‌ర్వాత విజ‌యోత్స‌వ ర్యాలీల‌పై ఎస్ఈసీ నిషేధం విధించింది. కొవిడ్ దృష్ట్యా ర్యాలీల‌ను నిషేధించిన‌ట్లు ఎస్ఈసీ వెల్ల‌డించింది. గెలుపొందిన అభ్య‌ర్థి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకునేందుకు ముగ్గురికే మాత్ర‌మే అనుమ‌తిచ్చింది. విజేత‌తో పాటు మ‌రో ఇద్ద‌రు మాత్ర‌మే ఎన్నిక‌ల రిటర్నింగ్ ఆఫీస‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం పొందాల‌ని ఆదేశించింది.గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్‌తో పాటు అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, సిద్దిపేట మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఇక పోలింగ్ ప్ర‌క్రియ‌కు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటు వేసేందుకు వ‌చ్చి ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని ఎస్ఈసీ విజ్ఞ‌ప్తి చేసింది. ఇక పోలింగ్ సిబ్బందికి మాస్కు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ అంద‌జేయ‌నున్నారు. ఎన్నిక‌ల‌ ముందు రోజు పోలింగ్ కేంద్రాల‌ను శానిటైజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here