అబాధి స్థలాలు ఆక్రమణకు గుర‌వుతున్నాయంటూ ఫిర్యాదు

0
136
Spread the love

మంథని బొక్కల వాగు పరిసరాల్లోని అబాధి స్థలాలు ఆక్రమణకు గుర‌వుతున్నాయంటూ అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఉపసర్పంచ్, ఇనుముల సతీష్. ఆయ‌న ఇచ్చిన‌ ఫిర్యాదులో వివ‌రాలు ఇలా ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా మంథని బొక్కల వాగు పరిసరాల్లోని విలువైన ప్రభుత్వ అబాధి స్థలం ఆక్రమణ..!!సమీప ఇంటి నంబర్లతో గుంటల కొద్ది ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్లు..!!అధికారంలో ఉన్న కొందరి అండదండలతో,పదవులు ఉన్న కొందరి బినామీ పేర్లతో అక్రమంగా కట్టని ఇండ్లకు…పెట్టని గోడలకు సెల్ఫ్ అస్సెస్మెంట్ పేరిట ఖాళీ స్థలాలకు ఇంటి పన్ను అంటూ ఆస్తిపన్ను మదింపు…! జనవరి25 న 13 మంది…జనవరి26న మరో 13 మంది పేరిట సెల్ఫ్ అస్సెస్మెంట్ మాటున ఇంటిపన్ను రసీదుల జారీ…!! కోట్ల రూపాయల విలువైన అబాదీ స్థలం అన్యాక్రాంతంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, సెల్ఫ్ అస్సెస్మెంట్ పేరిట,లేని ఇండ్లకు ,ఖాళీ స్థలాలకు ఆస్తి పన్ను రసీదులు ఇచ్చి రిజిస్ట్రేషన్ కావడానికి, అబాధి స్థలానికి ఎసరు పెట్టడానికి సహకరించిన స్థానిక మున్సిపల్ సిబ్బందిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు చేపట్టాలి.”

అని కోరుతూ పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ కు మాజీ ఉపసర్పంచ్, ఇనుముల సతీష్ వినతిపత్రం సమర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here