పనితీరు బాగుంది కొనసాగించండి..నిధులు సరిపోను ఉన్నాయా?

0
86
Spread the love

పనితీరు బాగుంది కొనసాగించండి

నిధులు సరిపోను ఉన్నాయా?

ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి

మొట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక0గా సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం మొట్లగూడెమ్ గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ కార్యదర్శిని ఈజీస్ పనుల్లో ఉండటంతో సర్పంచ్ పనస సమ్మయ్యను పిలిపించుకున్నారు. గ్రామ పంచాయతీ పనులను అరా తీశారు. కార్యాలయాన్ని పరిశీలించారు. మొక్కలు నాటి, పరిశుభ్రంగా ఉండటంతో అభినందించారు. మంచినీటి ప్లాంట్ ని ఇంకా వినియోగిస్తున్నారా? మిషన్ భగీరథ మంచినీరు వస్తున్నదా? అని అడిగారు. భగీరథ నీరు వస్తున్నందున వాటినే వాడాలని సూచించారు. గ్రామ పారిశుద్ధ్యం పై కూడా అరా తీశారు. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడగడంతో సర్పంచ్, తమకు భూముల పట్టాలు ఇవ్వాలని అడిగారు. దీంతో మంత్రి వాటి విషయమై సీఎం గారు త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here