ఈటల రాజీనామాను ఆమోదించారు స్పీకర్ పోచారం 

0
206
Spread the love

ఈటల రాజీనామాను ఆమోదించారు స్పీకర్ పోచారం 

హైదరాబాద్ జూన్ 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: మాజీ మంత్రి ఈటల రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా 

 స్పీకర్‌ ఫార్మాట్‌లో అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా పత్రం

      తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు

       కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ఘోరీ కడతా..

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇవ్వాలనుకున్నానన్నారు. కొవిడ్‌ను అద్దం పెట్టుకుని స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. వారం రోజులు ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్ సాధ్యం కాలేదన్నారు. అనివార్యంగా ఈ రోజు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చానన్నారు. ‘‘అసెంబ్లీ గేట్ల వద్ద నా సహచరులు, అనుచరులను అడ్డుకున్నారు. గతంలో ఉన్న సంప్రదాయాలు తుంగలో తొక్కారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా అనుమతించలేదు. కేసీఆర్ అసలు రాజ్యాంగం, ఎమ్మెల్యేలు ఎందుకు అనే భావనలో ఉన్నారు. అందులో భాగమే తమకు జరిగిన అవమానమన్నారు. ప్రగతి భవన్ వెకిలి చేష్టలు మానుకోకపోతే పరాభవం తప్పదన్నారు. కేసీఆర్‌ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు. 
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూతెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్‌ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయనిఅధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు. కేసీఆర్‌ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు. ముందుగా ఈటల రాజేందర్‌ శనివారం ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. 

14న బీజేపీలో చేరిక.. 

ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్‌ ఛుగ్‌ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్‌ నేతలు శుక్రవారం షామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here