ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అనుమాన‌స్ప‌ద‌ మృతి

0
836
Spread the love

ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అనుమాన‌స్ప‌ద‌ మృతి

కోస్టల్ బ్యాంకు డైరెక్ట‌ర్‌….. ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అనుమాన‌స్ప‌ద‌రీతిలో మృతి చెందారు. కృష్ణ జిల్లా నందిగామ (మ) ఐతవరం గ్రామ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు పక్కన పొల్లాల్లో పడి ఉన్న కారులో ఆయ‌న మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అయితే ఇది ప్ర‌మాదవశాత్తూ జరిగిందా …లేక హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆయ‌న ప్ర‌యాణించిన‌ కారు సిసిటివి ఫుటేజ్ లను పలు టోల్గేట్ల నుండి సేకరించి ప‌రిశీలిస్తున్నారు. జ‌య‌రామ్ కారులో వెన‌క సీటులో కూర్చొని ప్ర‌యాణించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. తెల్ల‌ని ష‌ర్ట్ ధ‌రించిన వ్య‌క్తి కారును డ్రైవ్ చేసిన‌ట్లు పోలీసులు నిర్థారించారు. కారు వ‌ద్ద అత‌ను లేక‌పోవ‌డంతో అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు. జ‌య‌రామ్ కుటుంబం అమెరికాలో ఉంటుంది. ఆయ‌న రెండు రోజుల క్రితం హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరారు. వ్యాపార‌లావాదేవీలే హ‌త్య‌కు కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here