ప్రచురణల విభాగానికి అవార్డుల పంట

0
48
Spread the love

ప్రచురణల విభాగానికి అవార్డుల పంట

హైదరాబాద్, సెప్టెంబర్ 07, 2021 – కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రచురణల విభాగానికి, ప్రచురణల్లో ఉన్నత ప్రమాణాలకు గాను 2021 సంవత్సరానికి పది (10) అవార్డులు వచ్చాయి. జెనీవాలోని అంతర్జాతీయ పబ్లిషర్ల అసోసియేషన్ కు అనుబంధ సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్, ఈ అవార్డులను ప్రకటించింది. కాఫీ టేబుల్ బుక్స్, జర్నల్స్, పిల్లల సాహిత్యం కేటగిరీలలో ఈ అవార్డులు లభించాయి. ఆర్థిక సర్వే 2021, కోర్ట్స్ ఆఫ్ ఇండియా, యోజన (పంజాబీ) వివిధ కేటగిరీల్లో ప్రథమ బహుమతి పొందగా, మహాత్మా గాంధీ-లైఫ్ త్రూ లెన్సెస్, రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాల సంకలనం ‘లోక్ తంత్ర్ కేస్వర్’ రెండవ బహుమతి పొందాయి. గ్రామీణాభివృద్ధి అంశాలపై ప్రచురించే ‘కురుక్షేత్ర’ పుస్తకాల కేటలాగ్ మూడవ బహుమతి పొందాయి.
ఈ అవార్డులను న్యూ ఢిల్లీలో సెప్టెంబర్ 17న అందజేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here