తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా అంబాటులోకి నూత‌న వైద్య పరికరాలు

0
105
Spread the love

ఆధునిక సాంకేతక పరిజ్ఞానం వినియోగించి అత్యల్ప ఉష్టోగ్రతల వద్దే తక్కువ సమయంలోనే వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసే పరికరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా అందుబాటులోనికి తెచ్చిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్

శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, BIACH&RI చేతుల మీదుగా నేటి ఉదయం లాంఛనంగా ప్రారంభం

క్యాన్సర్ చికిత్స కు వచ్చే రోగులకు వైద్యాన్ని అందించే సమయంలోనూ, శస్త్ర చికిత్స నిర్వహించాల్సినపుడు, పలు వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసిన సందర్భాలలో వినియోగించే పలు వైద్య పరికములను పలు మార్లు తిరిగి వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి పరికరములు, సాధనములను మరళా మరళా వినియోగించే సందర్భాలలో వాటిని పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయడానికి అవసరానికి తగినట్లుగా అత్యధిక ఉష్టోగ్రతల వద్ద లేదా తక్కువ ఉఫ్ణోగ్రతల వద్ద శుభ్రం (స్టెరిలైజ్) చేస్తారు. ముఖ్యంగా మెటల్ అధారిత పరికములను అత్యధిక ఉష్టోగ్రత వద్ద చేస్తే ప్లాస్టిక్, రబ్బర్ లాంటి పదార్థములతో తయారైన పైపులను, పరికరములు అత్యల్ప ఉష్టోగ్రత వద్ద శుభ్రం (స్టెరిలైజ్) చేస్తారు.

ఈ అవసరములకు అనుగుణంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వద్ద ఈ రెండు విధానాలలో శుభ్రం చేయడానికి వీలుగా ఆధునిక స్టెరిలైజ్ యంత్రాలు వినియోగిస్తున్నారు. అయితే ఇందులో అత్యల్ప ఉష్టోగ్రతల వద్ద నాన్ మెటాలిక్ పదార్థములతో తయారైన పరికములను, సాధనములను శుభ్రం చేసే పరికరం యొక్క కాలపరమితి తీరడంతో ఇందుకోసం అమెరికా నుండి అత్యాధునిక ప్లాస్మా స్టెరిలైజేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ASP Sterad 100 NX with All Clear Technology తో కూడిన యంత్రాన్ని సమకూర్చుకున్నారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఈ యంత్రం తో గతంలో ఉన్న పాత యంత్రం తీసుకొనే సమయం కన్నా సగం సమయం అంటే 24 నిమిషములలోనే శుభ్రం చేయగలగడమే కాకుండా 99.9 శాతం వరకూ సూక్ష్మాతి సూక్ష్మ అవాంఛిత కణాలను కూడా పూర్తిగా తొలగించవచ్చు. తద్వారా ఒక రోగికి వినియోగించన తర్వాత మరో రోగికి వినియోగించే సందర్భాలలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నూటికి నూరు శాతం నిరోధించవచ్చు.
కరోనా మహమ్మారి కాలంలో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ యంత్రాన్ని నేటి ఉదయం శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు సాంప్రదాయబద్దంగా పూజాధికాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించి వినియోగంలోనికి తీసుకొని వచ్చారు.
ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ రోగులకు అత్యంత సురక్షిత, భద్రతతో కూడిన ఆధునిక చికిత్స అందించాలనే సంస్థ లక్ష్యానికి అనుగుణంగానే ఈ అత్యాధునిక స్టెరిలైజేషన్ యంత్రాన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్ట మొదటి సారిగా హాస్పిటల్ లో ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్థుత కరోనా కాలంలో నూటికి నూరు శాతం ఇన్ఫెక్షన్లను నిరోధించే ఈ యంత్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అంతే గాకుండా ఈ యంత్రం కారణంగా పునర్వినియోగం చేయాల్సిన వైద్య పరికములు, సాధనములు అతి తక్కువ సమయంలోనే అందుబాటులోనికి వస్తాయని తద్వారా ఎక్కువ మంది రోగులకు వీటిని ఆలస్యం లేకుండా వినియోగించే వీలుంటుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణతో శ్రీ జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; శ్రీ యం భరత్, ట్రస్టు బోర్డు సభ్యులు, BIACH&RI; డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; శ్రీ రవికుమార్, COO, BIACH&RI; డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్ (అకడమిక్ & యాడ్ లైఫ్), డా. బసంత్ కుమార్, ఛీఫ్ అనస్థీషియాలజిస్టు, BIACH&RI; శ్రీ రామాంజనేయ గౌడ్, విభాగాధిపతి, బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం, BIACH&RI లతో పాటూ బయోమెడికల్ ఇంజనీర్లు శ్రీ వెంకటేష్, రమ్య లతో పాటూ ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

StandByPVSunilKumarIPS || AP State Wide Protests

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here