అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురి అరెస్ట్

0
119
Spread the love

యాంకర్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రెండు లక్షల 25 వేల విలువైన 7.82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డిసిపి అశోక్ కుమార్ తెలిపారు.
ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని CSPకాలనీ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని వన్ టౌన్ సిఐ రమేష్ సహకారంతో సీసీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున గంజాయి నిల్వలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన తెలిపారు.

చిన్న వయసులో జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాగా ఏర్పడి అక్రమ రవాణాకు తెరలేపారు. చివరకు వీరిని పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు తరలించారు. ఈ విషయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here