ప్రత్యేక హరిత, విద్యుత్ వెలుగుల్లో నగర ఫ్లైఓవర్లు
ఆకట్టుకున్న ఫ్లైఓవర్ల సుందరీకరణ
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్లు చూపర్లను ఆకట్టుకునేలా, ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న 10 ఫ్లైఓవర్లను రంగురంగుల విద్యుత్ దీపాలు, ఆకట్టుకునే హ్యాంగిగ్ గార్డెన్, వర్టికల్ గార్డెన్ల ఏర్పాటుతో పాటు ప్రధాన ఫ్లైఓవర్ల వద్ద ఫౌంటెన్లను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని దాదాపు 80శాతం పూర్తిచేశారు. జీహెచ్ఎంసీకి చెందిన అర్బన్ బయోడైవర్సీటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులను చేపట్టాయి. ఈ 10 ఫ్లైఓవర్లలోని 33 ఫ్లైఓవర్ల పిల్లర్లను ను ఆధునీకరించడం, లైటింగ్ గ్రీనరీతో పాటు ఆకర్షనీయంగా ఉండే మోడల్స్‌ను ఏర్పాటు చేశారు.
అర్బన్ బయోడైవర్సిటీ ద్వారా…
అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ద్వారా ఈ 10 ఫ్లైఓవర్లలో ఆకర్షనీయంగా కంటికి ఆహ్లాదకరంగా ఉండేవిధంగా వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. పలు ఫ్లైఓవర్లలో హరిజంటల్గా మొక్కలను క్రమపద్దతిన ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైఓవర్ల వద్ద సివిల్ పనులు జరుగుతున్నందున ఇవి పూర్తైన అనంతరం క్రింది భాగంలో రంగురంగుల సీజనల్ పూలతో కూడిన గ్రీనరీని పెంచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.
రూ. 1.60 కోట్లతో ప్రత్యేక లైటింగ్
రాత్రివేళలో ఫ్లైఓవర్లు మరింత ఆకర్షనీయంగా స్పెషల్ లైటింగ్‌తో ధగధగలాడేవిధంగా కోటి 60లక్షల రూపాయల వ్యయంతో లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైఓవర్లలో పంజాగుట్ట ఫ్లైఓవర్‌కు ఏర్పాటుచేసిన థీమ్ లైటింగ్ హైలెట్‌గా నిలుస్తోంది. కేవలం పంజాగుట్ట ఫ్లైఓవర్లకే రూ. 50లక్షల వ్యయంతో ప్రత్యేక థీమ్ లైటింగ్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. పిల్లర్లు, జంక్షన్లు, మురల్ విగ్రహాలు ఉన్న ఫ్లైఓవర్లకు కలర్‌ఫుల్ లైటింగ్, నాగార్జున గ్రీన్ ల్యాండ్ ఫ్లైఓవర్లకు డిజైన్ ఉన్న లైటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు.
ఇంజనీరింగ్ విభాగం చే..
ఫ్లైఓవర్ల సుందరీకరణలో భాగంగా ఫ్లైఓవర్లకు మరమ్మతులు చేయడం, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు ఫ్లైఓవర్లకు కలర్లను ఇంజనీరింగ్ విభాగం ద్వారా వేయించారు. మలక్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద నగర ప్రజలకు ప్రీతి పాత్రమైన ఇరానీ చాయ్‌ను సూచించే కప్పు, సాసర్, ఖుజాల నమూనాలను ఏర్పాటు చేశారు. ఆకట్టుకునేలా ఫౌంటెన్లు, మురల్స్ను ఏర్పాటు చేశారు.
మంత్రి కె.టి.ఆర్ సలహాతోనే…
నగరంలోని ఫైఓవర్లను ఆకర్షనీయంగా, సుందరీకరించాలన్నా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తనతో పాటు పలువురు అధికారులు న్యూఢిల్లీలోని ఫ్లైఓవర్లను పరిశీలించామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. నగరంలో 12 ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. సరికొత్త ఆకర్షనీయంగా ముస్తాబైన ఫ్లైఓవర్ల పై నగరవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు.
అభివృద్ది చేపట్టిన ఫ్లైఓవర్లు ఇవే…
1. మలేక్పేట్
2. పారడైస్ ఫ్లైఓవర్
3. బేగంపేట్ ఫ్లైఓవర్
4. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పారడైస్ ఫ్లైఓవర్
5. హరిహర కళాభవన్ ఫ్లైఓవర్
6. మాసబ్ ట్యాంక్
7. బషిర్‌బాగ్ ఫ్లైఓవర్
8. తెలుగు తల్లి ఫ్లైఓవర్
9. గ్రీన్ ల్యాండ్ ఫ్లైఓవర్
10. పంజాగుట్ట ఫ్లైఓవర్