200 మందిని బ‌దిలీ చేసిన అట‌వీ శాఖ‌…11 మంది పై సస్పెన్షన్ వేటు

0
400
Spread the love

అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించే నిబద్ధత… అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అటవీ శాఖ బదిలీలకు శ్రీకారం చుట్టింది. దాదాపు రెండు వందల మంది అధికారులను బదిలీ చేసింది. అడవుల సంరక్షణ విషయంలో అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. జంగిల్ బచావో- జంగిల్ బ‌డావో నినాదం తో అడవుల సంరక్షణకు అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. అడవిని రక్షించే బాధ్యతను అంకితభావం కలిగిన అధికారులకు అప్పగించాలని స్పష్టంగా చెప్పారు. ఎక్కువ మంది అధికారులు హైదరాబాద్ లో ఉండటం కాకుండా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీ శాఖ సంస్కరణలు ప్రారంభించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మంచి అధికారులను నియమించడం, స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి మెమోలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టింది.

200 మందిని బ‌దిలీ చేసిన అట‌వీ శాఖ‌

అడవులను సంరక్షించడంలో మంచి పేరు ఉన్న అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించింది. దీంతో చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు దాదాపు రెండు వందల మంది బదిలీ అయ్యారు. ఈ బదిలీల ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంగళవారం సంతకం చేశారు. జిల్లా అటవీ అధికారులు గా పనిచేస్తున్న చీఫ్ కన్జర్వేటర్ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

11 మంది పై సస్పెన్షన్ వేటుతో పాటు పలువురికి మెమోలు

అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో ఇటీవల కాలంలో 11 మందిని అటవీశాఖ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఫారెస్ట్‌ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయి నుంచి గార్డుల వరకు ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమోలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here