భోజన పథకాన్ని ప్రారంభించిన  మేయర్

0
69
Spread the love

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటల భోజన పథకాన్ని ప్రారంభించిన  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


హైదరాబాద్, మే 12:
  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  విశేష కృషి చేస్తున్నదని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రి, ఎం.ఎన్.జె (మెహది నవాబ్  జాంగ్)  ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ లో మూడు పూటల భోజనం పథకాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…  ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవల కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నామన్నారు.  మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఖర్చయినా  వెనకాడకుండా పేదలకు మెరుగైన వైద్యం, చికిత్సలను అందుబాటులోకి తెచ్చారన్నారు. హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం రాష్ట్ర నలుమూలల నుండే  కాక ఇతర రాష్ట్రాల ప్రజలు చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకులకు మూడు పూటల మంచి పౌష్టికాహారాన్ని రూ.5 లకే  అందించడం తో  పాటుగా షెల్టర్లు, వైద్యం ఆరోగ్య పరీక్షలు, మెడిసిన్ లు  ఉచితంగా అందించడం వలన పేదలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వెసులుబాటు ఉంటుందన్నారు.  నగరంలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజన పథకానికి సుమారు 39 కోట్లు ఖర్చు లెక్క చేయకుండా అమలు చేస్తున్నట్లు  తెలిపారు.

 పెద్ద ఆసుపత్రి అయిన గాంధీ, ఉస్మానియా, నిమ్స్  హాస్పటల్ లలో  సరాసరి 600 మందికి  ప్రతి రోజు మిగతా ఆసుపత్రుల్లో సరాసరి 300 బోజనాలు మూడు పూటలు  రు 5 లకే అందిస్తారని మేయర్ వెల్లడించారు. ఉదయం 8  గంటల నుండి  9.30  వరకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 పిఎం వరకు  మధ్యాహ్నం భోజనం,  సాయంత్రం  6 గంటల నుండి రాత్రి 8.30 వరకు రాత్రి భోజనాలు అందిస్తారని మేయర్ తెలిపారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ దినోత్సవ సందర్భంగా  ఎం ఎన్ జే  క్యాన్సర్  హాస్పిటల్ లో  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నర్సింగ్ స్టాఫ్ తో కలిసి  కేక్ ను కట్ చేశారు. ఈ  సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ప్రైవేట్ హాస్పిటల్ లో  ఉన్న వసతులను ప్రభుత్వ హాస్పిటల్ లో వసతుల ఏర్పాటు కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని అన్నారు.

 హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం  ప్రధాన ఆసుపత్రి కి రావాలన్నా అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశ్యం తో నగరానికి నలు వైపులా ఆధునిక  వైద్య చికిత్స  కోసం 4 టీమ్స్  హాస్పిటల్ గౌ. ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవడం ముఖ్య ఉద్దేశమన్నారు.  వైద్యులు,సిబ్బంది,నర్సింగ్ స్టాఫ్ పేదలకు చికిత్స అందించడంలో చిత్త శుద్ధి తో విధులు నిర్వహించాలన్నారు. కరోనా సందర్భంగా వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు  సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు మేయర్ తెలియ జేశారు.

ఈ  కార్యక్రమంలో సందర్భంగా మేయర్ వెంట కోఠి ప్రసూతి హాస్పిటల్  సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఎం.ఎన్.జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ  రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత  తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here