‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – మంత్రి కిష‌న్ రెడ్డి

0
72
Spread the love
  • హర్ ఘర్ తిరంగా అభియాన్ కింద 6 కోట్లకు పైగా తిరంగా సెల్ఫీలు హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లో అప్‌లోడ్ అయ్యాయి
  • 5,885 మంది వ్యక్తుల భాగస్వామ్యంతో చండీగఢ్‌లో రూపొందించబడిన ప్రపంచపు ‘ ‘లార్జెస్ట్ హ్యూమన్ ఇమేజ్ ఆఫ్ ఎ వేవింగ్ నేషనల్ ఫ్లాగ్’ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు
  • ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావద్భారతం ఏకతాటిపైకి వచ్చింది. భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ ఐకమత్యం, సమగ్రతపై మన ప్రజలకున్న సత్ సంకల్పానికి ఇదొక నిదర్శనం: జి.కిషన్ రెడ్డి


(తూఫాన్ – హైద‌రాబాద్‌)

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ త్రివర్ణ పతాకాన్ని ఇంటికి తీసుకెళ్లేలా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుని ప్రజల్లో దేశభక్తి, జాతీయవాద భావనను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు చాలా విస్తృతంగా పనిచేస్తూ ప్రజలను ఈ మహోద్యమంలో భాగస్వాములను చేయడంలో ప్రోత్సహించాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో తీవ్రంగా కృషి చేశాయి. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను స్పృశిస్తూ.. ప్రజల్లో దేశభక్తి, ఐకమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం కావడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావద్భారతం ఏకతాటిపైకి వచ్చింది. భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ ఐకమత్యం, సమగ్రతపై మన ప్రజలకున్న సత్ సంకల్పానికి ఇదొక నిదర్శనం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ‘‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ జెండా తో సెల్ఫీ దిగి దాదాపు 6 కోట్ల మంది వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలపాలన్న ప్రజల వజ్ర సంకల్పానికి ఇది నిదర్శనం. మువ్వన్నెలతో సెల్ఫీలు తీసుకున్న వారు ఫొటోలను అప్ లోడ్ చేయండి. అప్పుడే ఈ పండగ స్ఫూర్తి మరిన్ని రోజులు కొనసాగుతుంది.

ప్రజలకు జాతీయ జెండాతో భౌతిక, భావోద్వేగ సంబంధాన్ని నెలకొల్పే లక్ష్యంతో జాతీయ భావనను పెంపొందించేందుకు సెల్ఫీలను తీసుకుని www.harghartiranga.com వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలనో, కరోనా వారియర్స్ కు మద్దతుగా నిలవాలనో.. ఇలా మోదీజీ ఇచ్చిన ప్రతి పిలుపునూ దేశ ప్రజలు అంతే సానుకూలంగా స్వీకరించారు. అదే రీతిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అంతకుమించిన ఉత్సాహంతో విజయవంతం చేశారు’ అని కిషన్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here