సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు

0
155
Spread the love

సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు

హైదరాబాద్‌ జూలై 17 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు తెలిపారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్‌ 10న ప్రారంభమై.. 19న ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గణేశ్‌ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు బాగు చేయడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల మేరకు అన్ని మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మండపాలు, దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాలని, డిస్కో పాటలు వద్దొన్నారు. ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here