జిహెచ్ఎంసి పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

0
146
Spread the love
*జిహెచ్ఎంసి పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి – మేయర్ విజయలక్ష్మి*
 
*హైదరాబాద్, అక్టోబర్ 01:*    ఈ నెల 6వ తేదీ నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీ నుండి చీరల పంపిణీకి జిహెచ్ఎంసి ద్వారా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు.   బతుకమ్మ చేరల పంపిణీ పై జోనల్ డిప్యూటీ కమిషనర్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలోని 30 సర్కిళ్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
     బతుకమ్మ పండుగను పేదలు  ఆనందోత్సవాలతో జరుకోవలనే ప్రధాన ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం మహిళలకు ఉచితంగా చీరల పంపిణీకి  శ్రీకారం చుట్టింది. ఒకొక్క సంవత్సరం ఒకొక్క ప్రత్యేక ఆకర్షణీయ డిజైన్ తో తయారు చేయించి, రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు  చీరలను 2017 సంవత్సరం నుండి 18 సంవత్సరాలు పైబడి ఆహారభద్రత కార్డు కింద నమోదైన మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున ఏర్పాట్ల లో ఎలాంటి లోటు పాట్లు ఉండకూడ దన్నారు
.
ఈ సంవత్సరం 30 సరికొత్త డిజైన్లతో 20 విభిన్న రంగులతో 810 రకాల చీరలు అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. జిహెచ్ఎంసి పరిధిలో 30 సర్కిళ్లలోని 1371 రేషన్ షాపులు, 838 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు  8,57,600 చీరలు వచ్చాయి. వార్డు, సర్కిల్, జోనల్ స్థాయిలో బిల్ కలెక్టర్, స్వయం సహాయక మహిళా ప్రతినిధి, రేషన్ షాపు డీలర్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం జోనల్, డిప్యూటి కమిషనర్లు ఏర్పాట్లు చేస్తారు. ప్రతి పంపిణీ కేంద్రానికి ఒక అధికారికి భాద్యతలు ఇచ్చినట్లు మొత్తం 2500 మంది పైబడి సిబ్బంది పంపిణీ సందర్భంగా  పాల్గొననున్నారు
గౌ.మంత్రులు, ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, డిప్యూటి మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులచే పంపిణీ చేస్తారు. ఈ పంపిణీ కేంద్రానికి ఆధార్ కార్డుగాని, ఫుడ్ సెక్యూరిటి కార్డు గుర్తింపు కార్డు తీసుకొని రావాలి, 60 ఏళ్లు పైబడిన మహిళలు, నడవలేని స్థితిలో ఉన్నవారందరికీ ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు.
 కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి, పంపిణీ కేంద్రం వద్ద చేతులు కడుకోవడానికి సబ్బు, నీళ్లు ఏర్పాటు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here