రూ.32.75 కోట్లతో ఫుట్ పాత్ నిర్మాణాలు

0
72
Spread the love

రూ.32.75 కోట్లతో ఫుట్ పాత్ నిర్మాణాలు

హైదరాబాద్, మార్చి 22: 
  రోజురోజుకు నగరం లో   ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పాదాచారుల భద్రత కోసం జిహెచ్ఎంసి ద్వారా ఫుట్ పాత్ ల నిర్మాణం పలు ప్రాంతాల్లో చేపట్టారు. పాదాచారులు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా వెళ్లేందుకు దోహదపడే విధంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేశారు.  ఒక పక్క నుండి మరో వైపు రోడ్డు దాటి వెళ్లాలంటే  విపరీతమైన వాహన రద్దీ కారణం ప్రజలు  ఎదుర్కొంటున్న  ఇబ్బందులను అధిగమించేందుకు జిహెచ్ఎంసి ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మించారు.


 ప్రజల అవసరాల కోసం ఫుట్ పాత్ నిర్మాణాలను చేపట్టారు. జిహెచ్ఎంసి పరిధిలో తెలంగాణ ఏర్పాటైన 2014-15 సంవత్సరం నాటికి  452 కిలోమీటర్ల పొడవు ఉన్న పుట్ పాత్  2021 నాటికి  816.90  కిలోమీటర్లకు పెరిగింది.  బాటసారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ఫుట్ పాత్ లను నిర్మించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో రూ. 32.75 కోట్ల అంచనా వ్యయంతో ప్రతి జోన్ లో 10 కిలో మీటర్ల చొప్పున  మొత్తం 75.64  కిలోమీటర్ల   పుట్ పాత్ నిర్మాణానికి  69 పనులు చేపట్టగా ఇప్పటి వరకు  రూ. 26.81 కోట్ల వ్యయంతో  60  పనులతో 62.08 కిలోమీటర్ల పొడవు గల పుట్ పాత్ ను పూర్తి చేశారు. మిగతా రూ. 5.94 కోట్ల విలువ గల 9 పనులు వివిధ ప్రగతి దశలో కలవు. అదనంగా సి.ఆర్.ఎం.పి ద్వారా నూతనంగా  60.94 కిలోమీటర్లు  పుట్ పాత్ చేపట్టడం అంతే కాకుండా 6.55  కిలోమీటర్ల పుట్ పాత్ ను మరమ్మతులు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here