*క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను త‌నిఖీచేసిన దాన‌కిషోర్‌*

0
224
Spread the love
*క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను త‌నిఖీచేసిన దాన‌కిషోర్‌*
 
  ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కు వ‌చ్చిన క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల త‌నిఖీ రేప‌టిలోగా పూర్తిచేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఆదేశించారు. ఖైర‌తాబాద్ జోన‌ల్ కార్యాల‌యంలో నూత‌న ఓట‌ర్ల న‌మోదుకై వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, చిరునామాల మార్పిడి, ఓట‌ర్ల తొల‌గింపు, ఇత‌ర మార్పులు చేర్పుల‌కై వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల త‌నిఖీ ప్ర‌క్రియ‌ను దాన‌కిషోర్ నేడు అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌ధానంగా నూత‌న ఓట‌ర్ల న‌మోదుకై వ‌చ్చిన ఫారం-6లను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. నూత‌న ఓట‌ర్ల న‌మోదుకై వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను క్షేత్ర‌స్థాయిలో బి.ఎల్‌.ఓల త‌నిఖీ, సూప‌ర్‌వైజ‌ర్ల ధృవీక‌ర‌ణ‌ సంత‌కం, ఏ.ఇ.ఆర్‌.ఓ, ఈ,ఆర్‌.ఓల ప‌రిశీల‌న అనంత‌రం ఈ.ఆర్‌.ఓ  ఆమోదించే సంత‌కాలు స‌క్ర‌మంగా ఉన్నాయా లేదా అనే అంశాల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి ప‌రిశీలించారు. క్లెయిమ్‌లు, అభ్యంత‌రాలకు సంబంధించి విడివిడిగా ఫైళ్ల‌ను రూపొందించి వాటిని ప్ర‌త్యేకంగా రూపొందించిన బాక్సుల‌లో ఉంచాల‌ని కమిష‌న‌ర్ ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల‌ను ప‌రిశీలిస్తున్న సూప‌ర్‌వైజ‌ర్ల‌తో ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను చేప‌డుతున్న విధానాన్ని దాన‌కిషోర్ అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం జోన‌ల్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటుచేసిన ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్‌, వివిప్యాట్‌ల పై అవ‌గాహ‌న కేంద్రాన్ని ప‌రిశీలించారు. ఈ కేంద్రాన్ని మ‌రింత ఆక‌ర్ష‌నీయంగా తీర్చిదిద్దాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. క‌మిష‌న‌ర్‌తో పాటు జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషార‌ఫ్ అలీ, డిప్యూటి క‌మిష‌న‌ర్ గీతారాధిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here