*ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌*

0
354
Spread the love

*ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌*
*ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల అమ‌లును త‌నిఖీచేసిన డా.బి.జనార్థ‌న్‌రెడ్డి*

 ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో జీహెచ్ఎంసీ ద్వారా చేప‌ట్టిన ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల అమ‌లు, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పురోగ‌తి, రోడ్ల నిర్మాణ ప‌నుల‌ను నేడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసిన త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మ‌ర‌ణంతో బుధ‌వారం జ‌ర‌గాల్సిన కామినేని ఎల్బీన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వం వాయిదా ప‌డ‌డంతో ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లోని స‌చివాల‌య్‌న‌గ‌ర్‌లో రూ. 50ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప‌రిశీలించారు. ఇదే స‌చివాల‌య న‌గ‌ర్‌ అర్భ‌న్ బ‌యోడైవ‌ర్సిటీ విభాగం ద్వారా వినూత్నంగా నిర్మించిన పంచ‌క‌ర్మ ఉద్యాన‌వ‌నాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం, వ‌న‌స్థ‌లిపురం ప్ర‌ధాన ర‌హ‌దారి సుశ్మ థియేట‌ర్ ఎద‌రుగా నుండి మ‌న్సూరాబాద్ బిగ్‌బ‌జార్ వ‌ర‌కు రెండు కిలోమీట‌ర్ల మేర నిర్మించిన పిపిఎం రోడ్డు నిర్మాణ నాణ్య‌త‌ను త‌నిఖీ చేశారు. న‌గ‌రంలో నిర్మిస్తున్న బ‌స్‌బేల‌లో భాగంగా ఆటోన‌గ‌ర్‌లో చేప‌ట్టిన బ‌స్‌బేల నిర్మాణాన్ని ప‌రీక్షించారు.
*ద‌స‌రా నాడు ఎరుక‌ల నాంచార‌మ్మ డ‌బుల్ ఇళ్ల ప్రారంభం*
హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్ మ‌న్సూరాబాద్‌లోని ఎరుక‌ల నాంచార‌మ్మ బ‌స్తీలో నిర్మిస్తున్న ఇన్‌సిటూ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ప‌రిశీలించారు. దాదాపు 26 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో తొమ్మిది అంత‌స్తుల‌లో నిర్మిస్తున్న 288 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను త‌నిఖీ చేశారు. పూర్తి అయ్యే ద‌శ‌లో ఉన్న ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల ప్లాస్ట‌రింగ్, సానిట‌రీ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని గృహనిర్మాణ ఇంజ‌నీర్లు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. డ‌బుల్ ఇళ్ల నిర్మాణాల‌లో నాణ్య‌త ప్రమాణాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల‌ని డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ద‌స‌రా పండ‌గ నాటికి ల‌బ్దిదారుల‌కు అందించేందుకుగాను ఎరుక‌ల నాంచార‌మ్మ బ‌స్తీ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను సిద్ధం చేయాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

*ఫ‌తుల్లగూడ ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్ సంద‌ర్శ‌న‌*

నాగోల్ స‌మీపంలోని ఫ‌తుల్ల‌గూడ‌లో సుమారు 7కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో నిర్మిస్తున్న ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను డా.జ‌నార్థ‌న్‌రెడ్డి ప‌రిశీలించారు. దేశంలోనే ప్ర‌ధాన నగ‌రాల్లో మ‌రెక్క‌డాలేనివిధంగా హైద‌రాబాద్‌లో జంతువుల సంర‌క్ష‌ణ‌కై ప్ర‌త్యేకంగా ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్నారు. రూ. 7కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్న ఈ ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్‌లో దాదాపు 400 వీధికుక్క‌ల సంర‌క్ష‌ణ‌కుగాను రెండు డాగ్ పాండ్స్‌, ప‌శువుల‌కై ప్ర‌త్యేకంగా క్యాటిల్ షెడ్ నిర్మాణం, కోతులను ఉంచేందుకు మంకీ షెడ్‌, వీధికుక్క‌లకు ఆప‌రేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, జంతువుల ఆహారానికై ప్ర‌త్యేక కిచెన్ రూమ్‌, వాచ్‌మెన్ క్వార్ట‌ర్‌, టాయిలెట్ల నిర్మాణాలు పురోగ‌తిలో ఉన్నాయి. ఈ ఫ‌తుల్లగూడ ఎనిమల్ కేర్ సెంట‌ర్ నిర్మాణ ప‌నుల‌ను 70శాతం పూర్త‌య్యాయ‌ని ఇంజ‌నీర్లు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. ద‌స‌రా నాటికి ఎనిమ‌ల్ కేర్ సెంట‌ర్‌ను ప్రారంభించేవిధంగా ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని ప్రాజెక్ట్ విభాగం ఇంజ‌నీర్ల‌ను క‌మిష‌న‌ర్ ఆదేశించారు. అనంత‌రం ఫ‌తుల్ల‌గూడ‌లో ఏర్పాటుచేసిన భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల ప్లాంట్‌ను ప‌రిశీలించారు.

*పాఠ‌శాల‌లో స్వ‌చ్ఛ క‌మిటీలు*

స్వ‌చ్ఛ హైద‌రాబాద్ స్ఫూర్తిని క‌లిగించేందుకు ప్ర‌తి పాఠ‌శాల‌లో త‌ర‌గ‌తుల వారిగా స్వ‌చ్ఛ క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని క‌మిష‌న‌ర్ డా.జ‌నార్థ‌న్‌రెడ్డి సూచించారు. మ‌న్సూరాబాద్‌లోని నాగార్జున ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించి పాఠ‌శాల విద్యార్థినీవిద్యార్థుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ప్ర‌తి ఇంటిలో ఉత్ప‌త్త‌య్యే చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌గా విడ‌దీసి స్వ‌చ్ఛ ఆటోలకు అందించ‌డంతో పాటు ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, మొక్క‌లు నాట‌డం త‌దిత‌ర స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై చైత‌న్యం క‌ల్పించేందుకు ప్ర‌తి త‌ర‌గ‌తి గ‌దిలో స్వ‌చ్ఛ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల‌లో క‌మిష‌న‌ర్ మొక్క‌లు నాటారు. క‌మిష‌న‌ర్‌తో పాటు జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి, డిప్యూటి క‌మిష‌న‌ర్ ముకుంద్‌రెడ్డి, ప్రాజెక్ట్‌, నిర్వహ‌ణ విభాగాల ఇంజ‌నీర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

*******

Ghmc Commissioner made surprise inspection of the ongoing works at LB Nagar

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here