Spread the love
*ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో బల్దియా కమిషనర్ సమీక్ష సమావేశం*
*హైదరాబాద్, ఫిబ్రవరి 15:* మార్చి 14వ తేదిన నిర్వహించే మహబూబ్ నగర్ – రంగారెడ్డి– హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ….గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 5.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియాన్ని తాత్కాలికంగా ఎంపిక చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తననియమావళి అమలులోకి వచ్చిందని, ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణకు గాను జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ ప్రియాంక అలా ను రిటర్నింగ్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. నామినేషన్లను జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులో గల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 సంవత్సరాలు నిండిన వారు, కోవిడ్ –19 పాజిటీవ్ వ్యక్తులను ప్రత్యేకంగా గుర్తించి వారి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి ఓట్లను ప్రత్యేకంగా వేయిస్తారని పేర్కొన్నారు.
*ఎమ్మెల్సీ ఎన్నికల వివరాలు*
నోటిఫికేషన్ విడుదల – 16-02-2021
నామినేషన్ల చివరి తేది – 23-02-2021
నామినేషన్ల పరిశీలన – 24-02-2021
నామినేషన్ల ఉపసంహరణ – 26-02-2021
పోలింగ్ తేది – 14-03-2021
పోలింగ్ సమయం 8:00 AM to 4:00PM
ఓట్ల లెక్కింపు – 17-03-2021
పోలింగ్ ప్రక్రియ ముగింపు – 22-03-2021
ఎన్నికల నోడల్ అధికారుల వివరాలు