*రికార్డు స్థాయిలో 10వేలకు చేరిన అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌లు*

0
372
Spread the love

*రికార్డు స్థాయిలో 10వేలకు చేరిన అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌లు*

గ‌త ఆరు విడ‌త‌లుగా చేప‌ట్టిన ఫుట్‌పాత్‌ల‌పై ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపులో భాగంగా రికార్డు స్థాయిలో 10వేల అక్ర‌మ నిర్మాణాల‌ను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ విభాగం తొల‌గించింది. దేశంలోని మ‌రే మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఇంత భారీ సంఖ్య‌లో ఫుట్‌పాత్‌ల‌పై అక్ర‌మ నిర్మాణాల‌ను తొల‌గించ‌డం జ‌ర‌గ‌లేదు. శ‌నివారం నాడు చేప‌ట్టిన ఫుట్‌పాత్ అక్ర‌మ‌ణ‌ల స్పెష‌ల్ డ్రైవ్‌లో 400 అక్ర‌మ‌ణ‌ల‌ను తొలగించారు. ఖైర‌తాబాద్ క్రాస్ రోడ్ నుండి పంజాగుట్ట క్రాస్‌రోడ్ వ‌ర‌కు, పంజాగుట్ట క్రాస్ నుండి ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ వ‌ర‌కు ఉన్న ఫుట్‌పాత్‌ల‌పై అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించారు. నేడు తొల‌గించిన 400 అక్ర‌మ‌ణ‌ల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో 10వేల అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది. పంజాగుట్ట ఫ్లైఓవ‌ర్ నుండి ఎస్‌.ఆర్‌న‌గ‌ర్ వ‌ర‌కు 108 శాశ్వ‌తంగా నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌ను, 150 మూవ‌బుల్ నిర్మాణాల‌ను తొల‌గించిన‌ట్టు విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి తెలియ‌జేశారు. అదేవిధంగా ఖైర‌తాబాద్ క్రాస్ రోడ్ నుండి పంజాగుట్ట ఫ్లైఓవ‌ర్ వ‌ర‌కు 71శాశ్వ‌తంగా నిర్మించిన అక్ర‌మ నిర్మాణాల‌ను, 65 తాత్కాలిక అక్ర‌మ‌ణ‌ల‌ను, 18 మూవ‌బుల్ నిర్మాణాల‌ను తొల‌గించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here