రూ.158 కోట్ల వ్యయంతో 448 వి.డి.సి.సి రోడ్లు

0
69
Spread the love

రూ.158 కోట్ల వ్యయంతో 448 వి.డి.సి.సి రోడ్లు

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1016 కోట్ల వ్యయంతో 385 పనులు పూర్తి


హైదరాబాద్, జూలై 04: 
  నగరంలో మౌలిక వసతుల కల్పనకు  జిహెచ్ఎంసి విశేషంగా  కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సి.సి రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు, వైకుంఠదామాలు, మోడ్రన్ మార్కెట్ లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టి ప్రజల అవసరాలను తీర్చడం  జరుగుతున్నది.


 ఈ నేపథ్యంలో  ప్రధాన రోడ్లకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో పలు కాలనిలో అంతర్గత రోడ్లకు చేపట్టేందుకు అంతే  ప్రాధాన్యతనిస్తున్నది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన  రోడ్డు వసతులను కల్పించేందుకు సి.సి రోడ్లతో పాటు నూతన టెక్నాలజీ తో చేపడుతున్న వి.డి.సి.సి (వాక్యూమ్ డి వాటరింగ్  సిమెంట్ కాంక్రీట్) రోడ్డు ను ముమ్మరంగా చేపడుతున్నారు.

 ఈ రోడ్డు వలన సాధారణ సి.సి రోడ్డు కంటే అధిక ప్రయోజనాలు ఉన్నాయి. అధిక పటిష్టత దృఢత్వంతో పాటు ఎక్కువ కాలం ఉంటుంది. గుంతలు ఏర్పడ కుండా ఉంటుంది. వి.డి.సి.సి రోడ్డు పై ఎలాంటి ఎదుగు దిగుడు లేకుండా సాఫీగా వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు నగరంలో  .డి.సి.సి రోడ్లు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగర వ్యాప్తంగా రూ. 158 కోట్ల 67 లక్షల 17 వేల విలువ గల 146 కిలోమీటర్ల గల 448 పనులు మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ.10 కోట్ల 75 లక్షల 60 వేల వ్యయంతో 29 పనులు చేపట్టి  8 కిలోమీటర్ల రోడ్డు పూర్తయ్యింది. రూ. 41 కోట్ల 16 లక్షల 41 వేల  విలువ గల 65 పనులు 33 కిలోమీటర్ల వి.డి.సి.సి రోడ్డు వివిధ దశలో కలవు . రూ. 76 కోట్ల 30 లక్షల విలువ గల 237 పనులతో 73.12  కిలోమీటర్ల, రోడ్డు ను ఇంకా ప్రారంభ దశలో కలవు. 27.10 కిలోమీటర్ల  గల 103 పనులు టెండర్ దశలో కలవు. 4.30 కిలో మీటర్ల గల 13 పనులు నిలుపుదల చేశారు. జోనల్ వారీగా మంజూరైన, చేపట్టిన పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  ఎల్బీనగర్ జోన్ లో రూ. 14.71 కోట్ల విలువ గల 37 పనులు 17.11 కిలోమీటర్ల రోడ్డు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోగా అందులో 4 పనులు పూర్తి కాగా 13 పనులు వివిధ ప్రగతిలో కలవు. ఇంకా 16 పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు.

చార్మినార్ జోన్ లో రూ. 29  కోట్ల 72 లక్షల 37 వేల అంచనా వ్యయంతో 61 పనులు  మంజూరు చేయగా 6 పనులు పూర్తి కాగా 9 పనులు ప్రగతి దశలో ఉండగా మరో  33 పనులు ఇంకా ప్రారంభ దశ కలవు. 13 టెండర్ దశలో కలవు.

ఖైరతబాద్ జోన్ లో రూ. 40 కోట్ల 74 లక్షల 50 వేల రూపాయల విలువ గల 146 పనులతో 31.34 కిలోమీటర్ల రోడ్డు చేపట్టేందుకు లక్ష్యం కాగా అందులో 7 పనులు పూర్తయ్యాయి. 26 పనులు అభివృద్ధి దశలో 96 పనులు ప్రారంభ దశలో మరో 12 పనులు టెండర్ దశలో కలవు.

శేరిలింగంపల్లి జోన్  రూ. 643.65 లక్షల అంచనా వ్యయంతో 10 పనులు 5.17 కిలోమీటర్ల రోడ్డు చేపట్టగా 4 పనులు పూర్తి కాగా, 2 పనులు అభివృద్ధి దశలో కలవు.

కూకట్ పల్లి జోన్ రూ. 1136.35 లక్షల వ్యయంతో 13.03 కిలో మీటర్ల గల రోడ్డును 35 పనులు మంజూరు కాగా అందులో 3 పనులు పూర్తి కాగా 4 పూర్తి కాగా, మరో 27 పనులు ప్రారంభ దశలో కలవు.

సికింద్రాబాద్ జోన్ రూ. 5569.30 లక్షల విలువ గల 159 పనులు 40.96  కిలోమీటర్ల రోడ్డు చేపట్టేందుకు నిర్ణయం తీసుకోగా  5 పనులు పూర్తి కాగా 11 పనులు  ప్రగతి దశలో ఉండగా 67  పనులు ప్రారంభ దశలో ఉండగా మరో 68 టెండర్ దశలో ఇంకొక 8 పనుల నిలుపుదల చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1016 కోట్ల వ్యయంతో 100.73 కిలోమీటర్ల రోడ్డు ను 385 పనులు పూర్తి చేశారు. ఎల్బీ నగర్ జోన్ లో 39 పనులు పూర్తి కాగా, చార్మినార్ జోన్ లో 83 పనులు, ఖైరతబాద్ జోన్ లో  160 పనులు,  శేరిలింగంపల్లి జోన్ లో 7 పనులు, కూకట్ పల్లి జోన్ లో 49 పనులు, సికింద్రాబాద్ జోన్ లో 47 పనులు పూర్తయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here