వరద ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి

0
110
Spread the love

వరద ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి

2250 కోట్ల రూపాయల వ్యయం తో వరద నివారణ పనులు

ముంపు నివారణకు కీలకం కానున్న యస్ ఎన్ డి పి

వరద ప్రమాదం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తి

మరికొన్ని ప్రాంతాల్లో వేగంగా కొనసాగుతున్న పనులు

వర్షాలు పడుతున్న పనులు కొనసాగించేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు
పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఎక్కువగా మేన్,మెటీరియల్ సిద్దం చేసుకోవాలని ఏజెన్సీ లకు ఆదేశాలు

మంత్రి కే టి ఆర్ ఆదేశాల తో వరద నివారణ పనుల పై ప్రత్యేక దృష్టి సారించిన. జి హెచ్ ఏం సి.

హైదరాబాద్ జూన్ 25 – భారీ వర్షాల వలన వచ్చే వరద వలన లోతట్టు, పరిసర కాలనీ లో ముంపు గురవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నివసించే లోతట్టు ప్రాంతలు, నాల పరిసర ప్రాంతాల లో వరదను అరికట్టుటకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యం లో నాలా ల సమగ్ర అభివృద్ది తో వరద ముంపు నివారణకు పరిష్కారం అవుతుందనే ఉద్దేశ్యం తో జి హెచ్ ఏం సి ప్రత్యేక చర్యలు చేపట్టింది. మైనర్, మేజర్ నాళాల తో పాటుగా చెరువుల వలన ,వచ్చే వరద ను అరికట్టేందుకు జి హెచ్ ఏం సి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది సమగ్ర నాలా ల అభివృద్ది పథకం ద్వారా చేపట్టే పనుల వలన, పూడిక తీత , మైనర్ నాలా రిటర్నింగ్ వాల్, బాక్స్ నిర్మాణాలు, చెరువుల వచ్చే వరద ను నియంత్రించేందుకు స్లూస్ నూతననిర్మాణాలు , మరమ్మత్తులు చేపట్టేందుకు జి హెచ్ ఏం సి పరిధిలో ఇప్పటికే పలు పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వాల హయం లో హైదరాబాద్ వరద ముంపు పట్ల ఏలాంటి శ్రద్ద తీసుకోక పోవడం, సరైన తగిన చర్యలు తీసుకోలేక పోవడం మూలంగా వచ్చిన ఈ దుస్తితి నీ అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నివారణకు కృషి చేస్తున్నది. ఈ నేపథ్యం లో హైదరాబాద్ వరద ముంపు నివారణకు వివిధ విభాగాల లైనా ఇంజనీరింగ్ మేయింటనెన్స్, ప్రాజెక్టు యస్ ఎన్ డి పి లేక్ విభాగాల ద్వారా 2250 కోట్లవిలువైన పనులను ప్రత్యేకంగా ముంపు నివారణ ను ముమ్మరంగా చేపట్టి పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

415 కోట్ల వ్యయం తో ఇంజనీరింగ్ మేయింటనెన్స్ ద్వారా, 1006 కోట్లు ప్రాజెక్టువిభాగం ద్వారా యస్ ఎన్ డి పి ద్వారా 735 కోట్లు, చెరువుల మరమ్మత్తులు కోసం 94 కోట్లు కేవలం వరద నివారణ కోసం జి హెచ్ ఏం సి పరిధిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి.

 

వ్యూహాత్మక నాలా అభివృద్ది పథకం:

వరద ముంపు నివారణకు రెండు దశల్లో చేపట్టేందుకు కార్యాచరణ సిద్దం చేశారు మొదటి దశలో ముంపు ఎక్కువగా ఉన్న ప్రాధాన్యత పనులను జి హెచ్ ఏం సి పరిధిలో 735 కోట్ల అంచనా వ్యయంతో 37 పనులు చేపట్టారు తలపెట్టిన 37 పనులలో 36 పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఒక పని ట్రాఫిక్ సమస్య ఏర్పడే నేపథ్యం లో పోలీసుశాఖ అనుమతి ఇవ్వవలసి ఉన్నది చేపట్టిన 36 పనులలో 13 పనులు పలు ప్రాంతాల్లో త్వరలో పూర్తి అవుతాయి యుద్ద ప్రాతిపాదికన పనులను వేగంగా పూర్తి చేసేందుకు జి హెచ్ ఏం సి విశేష కృషి చేస్తున్నారు జూలై చివరి వరకు కొన్ని పనుల పూర్తి చేసి మిగితా అన్ని పనులు సాధ్యమైన తొందరగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు, చేపట్టే పనుల వలన ప్రజల ఇబ్బందులు లేకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా అధిగమించేందుకు ప్రణాళిక బద్దంగా , ఫేజ్డ్ మ్యానర్ లో పనులను చేపట్టి వేగంగా పూర్తి చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకున్నారు వర్షం వచ్చిన పనులకు ఆటంకం కలగా కుండ ప్రత్యేక మాన్సూన్ అత్యవసర టీమ్ ను ఏర్పాటు చేసి పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు మేన్, మెటీరియల్ ను సిద్దం చేశారు. వరద తీవ్రత అధికంగా ఉన్న ఎల్ బి నగర్ కూకట్ పల్లి శెరి లింగం పల్లి జొన లలో చేపట్టిన పనులలో త్వరలో పూర్తి కానున్నాయి.

ఎల్ బి నగర్ జోన్ లో బత్తుల చేరవు నుండి ఇంజా పూర్ నాల సింగరేణి కాలనీ నుండి సరూర్ నగర చెరువు వరకు , రుంద్రంగ చెరువు నుండి మూసి నది వరకు, బడ్లగూడ చెరువు నుండి నాగోల్ చేరవు వరకు పనులు త్వరలో పూర్తి అవుతాయి. కూకట్ పల్లి జోన్ లో కొల్ నాల నుండి కెమికల్ నాల వరకు ఫాక్స్ సాగర్ సర్ప్లస్ కోర్స్ ఛానల్ రెస్తోరేశన్ వరకు , ఫాక్స్ సాగర్ శ్లూస్ నుండి వయా వల్వ్ నుండి కెమికల్ నాల వరకు త్వరలో పూర్తి కానున్నారు అదే విధంగా మిగితా జోన్ లో కూడా మేజర్ సమస్య ఉన్న నాలా ల వరద నివారణకు చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.


స్టార్మ్ వాటర్ డ్రైన్ :-
రెండు మీటర్ల లోపు వెడల్పు గల స్టార్మ్ వాటర్ డ్రైన్ కు బాక్స్ డ్రైన్ , రెండు మీటర్ల పై బడిన నాల రిటేనింగ్ వాల్, బాక్స్ డ్రైన్ పైప్ డ్రైన్, నిర్మాణాలు చేపట్టుతారు. స్టార్మ్ వాటర్ డ్రైన్ మరమ్మత్తులు, నిర్మాణాలతో పాటు నాలా భద్రత చర్యల్లో బాగంగా ఫ్రీ కాస్టు స్లాబ్స్, చైన్ లింక్ మెష్ పనులను చేపట్టేందుకు రూ.298 కోట్లఅంచనా వ్యయంతో 468 పనులు చేపట్టగా 139. 78 కోట్ల వ్యయం తో 2 79 పనులు పూర్తి అయ్యాయి మిగితవ్ . 98 పనులు వివిధ అభివృద్ది దశలో ఉండగా. మరో 19 పనులు రద్దు చేయడం జరిగినది. జనరల్ మెయింటెయిన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం లో 381 కోట్లతో 643 పనులు చేపట్టారు.

 

పూడిక తీత
నగర వాసులు సమీప నాలాల లో చెత్త, నిర్మాణ వ్యర్థాలు, పనికి రాని వస్తువులు వేయడం మూలంగా నీరు నిలిచి పరిసర లోతట్టు ప్రాంతాల్లో చేరడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు నాళాల లో పేరుకొని పోయిన చెత్తను తొలగించేందుకు పూడిక తీత కార్యక్రమం ను ఏడాది పొడువునా నిరంతరంగా చేపట్టడం జరుగుతున్నది ప్రస్తుత సంవత్సరం లో 56 కోట్ల31లక్షల వ్యయం తో 371 పనులు చేపట్టగా ఇప్పటి వరకు 3.39 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్ధాలను తీసేసారు.
మేజర్ నాళాల నిర్మాణాలు
రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న నాళాల పనులను పెద్ద నాళాలను మరమ్మత్తులు పునరుద్దరణ పనులను జి హెచ్ ఏం సి చేపట్టింది. మేజర్ నాళాల నిర్మాణం సందర్భంగా అవసరమైన ,కావల్సిన భూసేకరణ పూర్తి చేసిన తర్వాత నే పనులు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యం లో జి హెచ్ ఏం సి పరిధిలో ఉన్న మేజర్ నాలాల ను 1006 కోట్ల అంచనా వ్యయంతో 77 పనులను చేపట్టగా ఇప్పటి వరకు వివిధ అభివృద్ది దశ లో కలవు.


చెరువుల పటిష్టత
జి హెచ్ ఏం సి పరిధి లోని పలు చెరువులు, కుంటలు ద్వారా ప్రవహించే వరద ను అరికట్టేందుకు చెరువుల పటిష్టత కోసం స్లూస్ మరమ్మత్తులు, నూతన నిర్మాణాల, మురుగు నీరు మళ్లింపు లాంటి పనులను చేపట్టడం మూలంగా వరద నివారణకు పరిష్కారం అవుతుందనే ఉద్దేశ్యం తో 94 కోట్ల వ్యయం తో 63 పనులు చేపట్టగా అందులో 47 చేరవు పనులు పూర్తయ్యాయి మిగితా పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here