*అవార్డు స్పూర్తితో మ‌రింత మెరుగైన పౌర‌సేవ‌లు*

0
354
Spread the love

*అవార్డు స్పూర్తితో మ‌రింత మెరుగైన పౌర‌సేవ‌లు*

కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క శాఖ జీహెచ్ఎంసీకి ప్ర‌క‌టించిన అవార్డును స్వీక‌రించిన జోన‌ల్ క‌మిష‌న‌ర్ హ‌రిచంద‌న‌, శ్రీ‌నివాస్‌రెడ్డిలను నేడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ అభినందించారు. ప‌ర్యాట‌క స్థ‌లాల్లో మెరుగైన పౌర సేవ‌లు అందించినందుకుగాను జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి ఉత్త‌మ ప‌ర్యాట‌క అవార్డును కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కె.జె.అల్ఫాన్స్ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ దాస‌రి హ‌రిచంద‌న‌, శ్రీ‌నివాస్‌రెడ్డి స్వీక‌రించారు. తాము స్వీక‌రించిన అవార్డుతో నేడు క‌మిష‌న‌ర్‌తో భేటి అయ్యారు. జీహెచ్ఎంసీకి వ‌రుస‌గా రెండ‌వసారి జాతీయ స్థాయి ప‌ర్యాట‌క శాఖ‌ అవార్డులు ల‌భించడం ప‌ట్ల క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ అభినందించారు. ఈ అవార్డు స్పూర్తితో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో మెరుగైన పౌర సేవ‌లను అందించాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌కు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here