10వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకు కమిటీ ఆమోదం

0
71
Spread the love
*10వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 11 అంశాలకు కమిటీ ఆమోదం*
 
 
*హైదరాబాద్, మే 11:*   నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 10వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ 10వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 10 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా రూ. 43.65 కోట్ల వ్యయంతో ఐదు వివిధ అభివృద్ది పనులు, నాలుగు అంశాలు, రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనుల కోసం ఆమోదం పొందాయి.  
 
 
ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.ఎన్.సి జియాఉద్దీన్, సి.ఈ దేవానంద్,  సి సి పి దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెన్నెడీ, జోనల్ కమిషనర్లు  శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, పంకజ, మమత, సామ్రాట్ అశోక్, ఎంటమాలజి చీఫ్ రాంబాబు, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, కార్యదర్శి లక్ష్మి, 
 
స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మమ్మహద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, బత జబీన్, విజయ్ కుమార్ గౌడ్, మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, వై.ప్రేమ్ కుమార్, కుర్మ హేమలత తదితరులు పాల్గొన్నారు. 
 
 
*స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు…*
 
 
• అమీర్ పేట్   పాత మార్కెట్  అభివృద్ధికి రూ.13.20 కోట్ల  వ్యయంతో చేపట్టే మోడల్  మార్కెట్ నిర్మాణానికి  కమిటీ ఆమోదం.
 
 
• పంజాగుట్ట పాత  మార్కెట్ అభివృద్ధికి   రూ. 6.70 కోట్ల  తో  చేపట్టే మోడల్ మార్కెట్ నిర్మాణానికి  కమిటీ ఆమోదం.
 
 
• ఖైరతాబాద్ ఐమాక్స్ ఎదురుగా ఉన్న న్యూ 2BHK  డిగ్నిటీ హౌసింగ్ కాలనీ  ఇందిరా నగర్ నందు స్టేట్ ఆఫ్ ఆర్ట్ కన్వెన్షన్ హాల్ ను రూ. 18 కోట్ల తో నిర్మించేందుకు కమిటీ ఆమోదం.
 
 
• సికింద్రాబాద్ జోన్   లాలాపేట్ ఫ్లైఓవర్ (అంబేడ్కర్ విగ్రహం) నుండి మౌలాలి ఫ్లైఓవర్ వరకు  రూ. 3 కోట్ల వ్యయంతో  100 ఫీట్ల బి టి రోడ్డు వేయుటకు   కమిటీ ఆమోదం.
 
 
•  ప్రతిపాదించిన 30 మీటర్ల రోడ్డు వెడల్పు నకు    బండ్లగూడ   తులసి నగర్ (ఉడిపి హోటల్) నుండి వాడి-ఇ-హుడా (ఎయిర్ పోర్ట్) రూట్ వయా నూరి నగర్ బి.బ్లాక్ మిలాబ్ నగర్ హుస్సేన్ సాగర్, గౌస్ నగర్ మరియు ముస్తఫా హిల్స్ జి హెచ్ ఎం సి పరిధి వరకు  544 ప్రాపర్టీ ల సేకరణకు   చేసేందుకు కమిటీ  ఆమోదం.
 
 
•  ప్రియదర్శిని హోటల్ (మేడ్చల్ రోడ్డు) నుండి అంబేద్కర్ విగ్రహం, దుబ్బాయ్ గేట్ నుండి ఎల్బీనగర్  చివరి వరకు  60 మీటర్లు రోడ్డు వెడల్పు నకు   వేయుటకు ప్రతిపాదించిన నందు 352 ఆస్తుల సేకరణకు  కమిటీ ఆమోదం.
 
 
• ఎస్.హెచ్.జి  ద్వారా 04 మౌంటింగ్  ఫాగింగ్ మిషన్స్ హైరింగ్  (అద్దె) 01-05-2022 నుండి 31-10-2022 6 నెలల  పాటు కొనసాగించేందుకు  డి.డబ్ల్యూ.ఏ.సి.యు.ఏ( అర్బన్ డ్వాక్రా  గ్రూప్స్ ) ద్వారా   నిర్వహించేందుకు  ఒక్కో వెహికిల్ కు   నెలకు    రూ. 2,99,039 చొప్పున అద్దె  చెల్లించేందుకు  కమిటీ ఆమోదం.
 
 
• ఎల్బీనగర్ సర్కిల్ సాగర్ మెయిన్ రోడ్డు  నెం.15 వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీ నుండి హెచ్.పి పెట్రోల్ బంక్ కల్వర్ట్ వరకు  గల మురుగు కాలువలో  నిలిచిన నీరు తొలగింపు కొరకు    2.75 కోట్ల వ్యయం తో అర్ సి సి  NP3  పైపు  వేయుటకు కమిటీ ఆమోదం.
 
 
•  రోడ్డు వెడల్పు కార్యక్రమం లో బాగంగా  ఈ.ఎస్.ఐ మెట్రో స్టేషన్ (ఎర్రగడ్డ మెయిన్ రోడ్డు నుండి కె.ఎల్.ఎన్ యాదవ్ పార్కు ఈ.ఎస్.ఐ ప్రహరీ గోడకు ఆనుకొని  12 మీటర్ల రోడ్డు వెడల్పు చేయుటకు గాను  రెండు ఆస్తుల సేకరణకు ఆమోదం.
 
 
•  రోడ్డు వెడల్పు కార్యక్రమం ను పురస్కరించుకొని   రేతి ఫైల్  నుండి  అల్ప హోటల్ వరకు 36 మీ రోడ్డు వెడల్పు చేయుటకు  82 ఆస్తులను,  అల్పా నుండి  పాత గాంధీ ఆసుపత్రి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు చేయు సందర్భంగా 19 ఆస్తులు  ఓల్డ్ గాంధీ హాస్పిటల్ నుండి    వయా  మొండ మార్కెట్ మీదుగా సికింద్రాబాద్ వరకు   46 ప్రాపర్టీస్ సేకరణ  కొరకు కమిటీ ఆమోదం.
 
 

“అమ్మ నాన్న” సంస్థ సేవలు అభినందనీయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here