పదవీ భాద్యతలు స్వీకరించిన ..మేయర్, డిప్యూటీ మేయర్లు

0
262
Spread the love

*మేయర్, డిప్యూటీ మేయర్లుగా పదవీ భాద్యతలు స్వీకరించిన గద్వాల్ విజయ లక్ష్మి, మోతె శ్రీలత*

*హైదరాబాద్, ఫిబ్రవరి 22:*    గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత లు నేడు పదవీ భాద్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని  7వ అంతస్తులో మేయర్ ఛాంబర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవి ఛార్జ్ తీసుకునే ఫైల్ పై తొలి సంతకం చేశారు. డిప్యూటీ మేయర్ ఛాంబర్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మోతె శ్రీలత భాద్యత స్వీకరించే ఫైల్ పై  సంతకం చేశారు.

ఈ కార్యక్రమానికి  రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహ్మూద్ అలీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పార్లమెంటు సభ్యులు కె. కేశవ రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరై మేయర్ విజయ లక్ష్మి ని అభినందించారు. నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు మేయర్ విజయ లక్ష్మి ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here