పంజాగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మేయర్

0
46
Spread the love
 
*పంజాగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ప్రారంభించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
.
*హైదరాబాద్, మే 11-2022*:   ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద రూ. 5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా అవసరమైన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవడం జరుగుతున్నదని, విద్య, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో  ట్రాఫిక్ ను అధిగమించేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ మెరుగు పరచడం జరిగిందని, రాష్ట్ర మున్సిపల్, పురపాలక శాఖ, ఐటీ మంత్రి  కేటిఆర్ ముందు చూపుతో నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యూహాత్మకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని మేయర్ వెల్లడించారు. పంజాగుట్ట జంక్షన్ వద్ద  విపరీతమైన ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి వలన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వరద నివారణకు నాలా పనులను వేగవంతం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

పంజాగుట్ట బ్రిడ్జి  మిల్డ్ స్టీల్ (ఎం.ఎస్) చేపట్టారు.  లిఫ్ట్, ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం ప్రయాణికులు రోడ్డు కు ఇరువైపులా రోడ్డును క్రాసింగ్ చేయాలంటే  ఇబ్బంది తో పాటుగా తరుచుగా ప్రమాదాలు జరిగేవి. దాన్ని అధిగమించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు మేయర్ తెలిపారు.

నగరంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజల సౌకర్యం కోసం సుమారు 40 లొకేషన్ లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టనున్నట్లు మేయర్ అన్నారు. ఖైరతబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్ మాట్లాడుతూ…  నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయడం కోసం కేటిఆర్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు పోతున్నట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు  ముంబాయి  తర్వాత హైదరాబద్ లోనే ఎక్కువగా ఉన్నాయని నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాల ద్వారా అమలు చేస్తూ ప్రజల కనీస అవసరాలను గుర్తించి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ లోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఇంఛార్జి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,  ఎస్ సి రత్నాకర్,  ఈ ఈ ఇందిరా బాయి తదితరులు పాల్గొన్నారు.
 
 

“అమ్మ నాన్న” సంస్థ సేవలు అభినందనీయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here