నేరెడ్ మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మేయర్

0
70
Spread the love

నేరెడ్ మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


హైదరాబాద్, ఆగష్టు 02:
నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో పాదచారుల ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డుకిరువైపులా సులభతరంగా వెళ్లేందుకు నగరంలో మరో నేరెడ్ మెట్  ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానున్నది. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కవ ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పాదచారులకు, వాహనదారులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చేసేందుకు జిహెచ్ఎంసి పరిధిలో  మొత్తం 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని తల పెట్టారు. ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు పూర్తి కాగా అందులో నేరెడ్ మెట్ బ్రిడ్జి తో 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నాయి.

మదినగూడ, మియాపూర్, పంజాగుట్ట, బాలానగర్, సెయింట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు అందుబాటులోకి వచ్చాయి. 
ఈ నేపథ్యం లో   హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుమలగిరి, కాప్రా, ఉప్పల్  వంటి ప్రధాన ప్రాంతాలను కలిపే రద్దీగా ఉండే జంక్షన్ లలో నేరెడ్ మెట్ ఎక్స్ రోడ్డు ఒకటి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో రోడ్డు దాటడం పెద్ద సమస్య ఏర్పడింది. పాదచారుల ప్రయోజనం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది.

నేరేడ్ మెట్ బ్రిడ్జి పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి  శాఖ  మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లా రెడ్డి  మల్కాజ్ గిరి శాసన సభ్యులు మైనంపాటి హనుమంత రావు,  డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డిలతో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం ఉదయం 10 గంటలకు  ప్రారంభించనున్నారు.

ఈ బ్రిడ్జి రూ. 3.25  కోట్ల  వ్యయంతో  చేపట్టారు 31 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు గల నడక మార్గం కలదు. సీనియర్ సిటిజన్ సౌకర్యం కోసం 10 మంది ప్రయాణికుల  కెపాసిటీ గల 2 లిఫ్ట్ లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత కోసం  6 సి సి టి వి లను  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొంటారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here