దోమల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి – మేయర్

0
49
Spread the love

దోమల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి – మేయర్


తూఫాన్‌, హైదరాబాద్, జూలై 31 దోమల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో దోమల నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాల కార్యక్రమాన్ని తన డివిజన్ లో ప్రారంభించారు.


ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఇంటిలోపల బయట కుటుంబ సభ్యులు అందరూ కలిసి 10 నిముషాల పాటు పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి దోమల వలన వచ్చే వ్యాధులకు దూరంగా ఉండేందుకు చేపట్టిన ప్రతి ఆదివారం 10 వారాల పాటు కొనసాగుతుందని మేయర్ అన్నారు.


జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 4846 కాలనీలలో దోమల నివారణకు ముమ్మరంగా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కాలానికి ఒక ఏ ఎల్ ఓ లను బాధ్యులను చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయా కాలని ప్రతినిధులు, కాలనీ వాసులందరు దోమల నివారణకు తమ వంతు భాధ్యతగా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరారు.

ఎంటోమలోజి ద్వారా అన్ని ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, డర్టీ వాటర్ లో ఆయిల్ బాల్స్, నీటిలో గాంబుషియ చేపలు వేయడం జరుగుతున్నదని ముఖ్యంగా యాంటి లార్వా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ పేర్కొన్నారు.

అడిషనల్ కమిషనర్ బి సంతోష్ మాట్లాడుతూ… డెంగ్యూ నివారణకు విస్తృతంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాల కార్యక్రమం 10 వారాల పాటు నిర్వహించి యాంటి లార్వా నియంత్రణ చర్యల్లో బాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో నిలిచిన గుంటలో ముళ్ళ పొదలు, పనికి రాని వస్తువులు సిమెంట్ తొట్లు , డ్రమ్ములు ,కూలర్లు, టైర్లు లలో శుభ్రం చేసుకొని తిరిగి నీరు నిలవ కుండ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిహెచ్ఎంసి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి కర పత్రంతో పాటుగా ప్రతి ఇంటికి దోమల నివారణకు చేయవల్సిన చర్యల పై స్టిక్కర్ కూడా వేయడం జరుగుతుందని దానికి తోడు కాలని ప్రధాన కూడళ్లో బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగిందని
ప్రతి అడువారం ఉదయం 10 గంటల 10 నిముషాల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొని విజయవంతం చేశారని అడిషనల్ కమిషనర్ సంతోష్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జోనల్ కమిషన్ రవి కిరణ్, చీఫ్ ఏంటోమాలజి రాంబాబు, డి సి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here