*ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి – మేయర్ విజయలక్ష్మి*

0
138
Spread the love

*ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి – మేయర్ విజయలక్ష్మి*

*బల్దియాలో వ్యాక్సినేషన్ ప్రత్యేక శిబిరం*

*హైదరాబాద్, ఏప్రిల్ 17:*   కోవిడ్ -19 మహమ్మారి నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు జర్నలిస్టులు, ఉద్యోగులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి చొరవతో ఏర్పాటుచేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు, ఉద్యోగులు హాజరై కో-వ్యాగ్జిన్ వ్యాక్సిన్ ను వేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ….ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన మున్సిపల్ సిబ్బందితో పాటు జర్నలిస్టులందరూ వ్యాక్సిన్ ను తీసుకోవడంతో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి పారిశుధ్య వర్కర్లందరికీ వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. నేడు జిహెచ్ఎంసిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 120 మంది జర్నలిస్టులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని మేయర్ విజయలక్ష్మి తెలియజేశారు.

*22,894 మందికి వ్యాక్సినేషన్ పూర్తి*
జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేటి వరకు 22,894 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు జిహెచ్ఎంసి తెలిపింది. పారిశుధ్య, ఎంటమాలజి తదితర విభాగాలకు చెందిన 24,949 మంది కార్మికులు ఉండగా వీరిలో 92 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. మిగిలిన వారిలో సెలవుల్లో ఉండడం, అనారోగ్య కారణాలు, ఉద్యోగ ఖాళీలు ఉండడం వల్లే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. మిగిలినవారిలో ముందుకువచ్చేవారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్బీనగర్ జోన్ లో మొత్తం 4,288 మంది కార్మికులు ఉండగా 4,083 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. ఖైరతాబాద్ జోన్ లో 4,993 మంది కార్మికులకు గాను 4,447 మందికి వ్యాక్సిలేషన్ ఇచ్చారు. శేరిలింగంపల్లి జోన్ లో 2,630 మందికి గాను 2,408 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కూకట్ పల్లి జోన్ లో 3,020 మందికిగాను ఇతర సిబ్బందికి కలిపి 3,772 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. సికింద్రాబాద్ జోన్ లో 4,798 మందికి గాను 4,641 మందికి, చార్మినార్ జోన్ లో 3,543 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here