కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరలో ప్రారంభం

0
164
Spread the love
కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరలో ప్రారంభం – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
 
*కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత*
 
*హైదరాబాద్, ఫిబ్రవరి 08:*   కొల్లూరులో నిర్మించిన రెండు పడకల గదుల భవనాలను త్వరలోనే ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ .విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కొల్లూరు ఫేస్ 2లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పంతో వారికి సొంతింటి కళ నెరవేరే విధంగా నయా పైసా లేకుండా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. నగరంలో  నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.. కొల్లూరు ప్రాంతం దూరంగా ఉందనే అపోహలు పడవద్దని కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో ఈ ప్రాంతంలో సుమారు 20 వేల పైగా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారుకొల్లూరులో 117 బ్లాక్ లలో 15,600 రెండు పడకల గదుల నిర్మాణం సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని ఒక్కొక్క బ్లాక్ వివిధ డిజైన్లతో నిర్మించడం జరిగిందని త్రాగునీరు వసతి అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరా లిఫ్టులు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడి కేంద్రం, ఆరోగ్య కేంద్రంబస్టాండ్ ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిత్యావసర వస్తువులకు ఇబ్బందులు లేకుండా  షటర్ లను కూడా ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు.

కొల్లూరు ఫేస్ 2 లో  15,600 తో పాటు  ఫేస్ 1 లో 2052  ఇళ్లు, ఈదుల నాగులపల్లి లో 1944 ఇళ్లు పూర్తయ్యాయి.  ఇళ్ల కేటాయింపులు పారదర్శకంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్ర మున్సిపల్  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు పరిశీలించినట్లు మేయర్  చెప్పారు.  డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ నియోజవర్గాలలో న్న అర్హులైన బీదవారికి ఇళ్లను కేటాయిస్తామని నయాపైసా లేకుండా ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేట్ సంస్థలు  నిర్మించిన గృహాల కంటే ఇక్కడ బ్రహ్మాండంగా  ఉన్నాయని త్వరలో ఈ ప్రాంతంలో నిర్మించిన గృహాలను అందుబాటులోనికి చేయడం జరుగుతుందని చెప్పారుఈ కార్యక్రమంలో హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్, డిప్యూటీ ఈ ఈ రఘునందన్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here