అన్నపూర్ణ కేంద్రాల్లో ప్రత్యేక వసతులను పరిశీలించిన మేయర్

0
315
Spread the love
అన్నపూర్ణ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులను పరిశీలించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, జనవరి 10:
   అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో కూర్చొని తినడానికి 32 ప్రాంతాల్లో వసతి ఏర్పాటుకు  ప్రతిపాదించినట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం కూకట్ పల్లి జోన్  సమీక్ష సమావేశం అనంతరం మూసాపేటలో ఆధునీకరించిన అన్నపూర్ణ కేంద్రాన్ని అకస్మికంగా పరిశీలించారు. ఒకొక్క కేంద్రం సుమారు రూ. 10 లక్షలతో ఖర్చు చేసి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 373 అన్నపూర్ణ కేంద్రాలు ఉండగా ప్రయోగాత్మకంగా సత్యం థియేటర్, లంగర్ హౌస్, టోలీచౌక్ ఫ్లైఓవర్ కింద, మాదాపూర్, నర్సాపూర్ ఎక్స్ రోడ్స్, గాజుల రామారావు ప్రాంతాల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినట్లు  మిగతా ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన పూర్తిచేస్తామని మేయర్ తెలిపారు. అనంతరం  “రూమ్ ఆఫ్ కైండ్ నెస్” కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో పాత వస్తువులను, పుస్తకాలు, ఇతర సామాగ్రి ఇక్కడ ఇవ్వడం ద్వారా అవసరం ఉన్నవారు వినియోగించుకోగలరని మేయర్ తెలిపారు.
 
ఈ సందర్భంగా  మేయర్  ఫతేనగర్, బాలానగర్ ఫ్లైఓవర్ క్రింది ఏర్పాటు చేసిన సుందరీకరణ పనులను పరిశీలించి అధికారులను అభినందించారు. అదే విధంగా  నర్సాపూర్ ఎక్స్ రోడ్  నుండి కుత్బుల్లపూర్  వరకు చేపట్టిన రోడ్డును పరిశీలించారు. బాలానగర్ ఫ్లైఓవర్ కు ఇరువైపులా చేపట్టిన  ఫుట్ పాత్ పనులను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here