వరద ముంపు నివారణకు  వేగంగా నాలా అభివృద్ది పనులు

0
72
Spread the love

 

*వరద ముంపు ను నివారణకు  వేగంగా నాలా అభివృద్ది పనులు*
*హైదరాబాద్, మే 20:*
   రానున్న వర్షాకాలంలో కురిసే వర్షాల కు ఈ సంవత్సరం లోతట్టు ప్రజలకు వరద ముంపు నివారణకు  ఎస్ ఎన్ డి పి  పనులు వేగంగా జరుగుతున్నాయి. వరద నివారణకు శాశ్వత పరిష్కారం కోసం జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. గతంలో అకాల వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కష్టాలు పడకుండా  చేసేందుకు రూ. 954 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక నాలా  అభివృద్ధి పథకం(SNDP) ద్వారా 60 పనులను చేపట్టారు. ప్రత్యేకంగా జిహెచ్ఎంసి పరిధిలో 37 పనులకు గాను 37 పనులు ప్రారంభమై వివిధ అభివృద్ధి దశలో కలవు,. నగరం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో  దాదాపు అన్ని  పనుకు  ప్రగతి దశలో కలవు.  వరద ప్రభావం గల వల్బరేబుల్  పాయింట్లు ను గుర్తించి  అక్కడ నీరు నిల్వ కుండ  క్రింది స్థాయికి నేరుగా వెళ్లే విధంగా తాత్కాలిక  చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో  రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు వరద వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఇది వరకే పలుసార్లు ఆదేశించారు. ఈ సారి మాత్రం వరద ముంపు ను తప్పించేందుకు  తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యం లో వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం క్రింద చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన వేగంగా పూర్తి చేయుటకు ముగ్గురు సి ఈ లను నియమించి  ఒక్కొక్కటి  రెండు, మూడు జోన్ల ను  కేటాయింపు  చేశారు.సికింద్రాబాద్ జోన్ లో 8 పనులు, కూకట్ పల్లి జోన్ లో 3 పనులు, ఎల్ బి నగర్ జోన్ లో 11 పనులు,  చార్మినార్ జోన్ లో 6 పనులు,  ఖైరతాబాద్ జోన్ లో 7, శేరిలింగంల్లి జోన్ లో 2 పనులు  మొత్తం 37 పనులు ప్రగతి దశలో కలవు, జిహెచ్ఎంసి  చుట్టూ ఉన్న  మున్సిపాలిటీ లలో 23 పనులకు గాను 21 పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు. జిహెచ్ఎంసి బయట ఉన్న మున్సిపాలిటీలు నిజాంపేట్ లో 9 పనులు, మీర్ పేట్ లో 3 పనులు, బడంగ్ పెట్ లో 7 పనులు, జల్ పల్లి 2 పనులు, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ  లో 1 పనులు, కొంపల్లి మున్సిపాలిటీలో 1 పనులు మొత్తం 23 పనులను చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here