నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

0
129
Spread the love

*నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*

*హైదరాబాద్, మార్చి 15:*   చార్మినార్ జోన్ లో పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చాలని, ఈ విషయంలో డిప్యూటి కమిషనర్లు, ఏఎంహెచ్ఓ లు, ఎస్.ఎఫ్.ఏ లు నిరంతరాయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం ఎస్.ఎన్.డి.పి పనులను పరిశీలించిన అనంతరం చార్మినార్ జోన్ కార్యాలయంలో జోన్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తో కలిసి జోనల్ లో జరుగుతున్న వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా పారిశుధ్యం పై జోన్ వారిగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రధాన కూడళ్లు, కాలనీల్లో చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు స్వచ్ఛ ఆటోల ద్వారా తరలించేందుకు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే ట్రాన్స్ ఫర్ స్టేషన్లను సర్కిల్ కు రెండు చొప్పున పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గార్బెజ్ పై న అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. జోన్ లో ఉన్న టాయిలెట్స్ లో వాటర్, క్లీనింగ్ వంద శాతం చేపట్టేందుకు ఏజెన్సీ ద్వారా ఏ.ఎం.ఓ.హెచ్, ఏ.ఇ, వర్క్ ఇన్ స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోనల్ నందు ఖాళీగా ఉన్న శానిటేషన్ వర్కర్ల పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్దతిలో వెంటనే భర్తీ చేసేందుకు కమిషనర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. సి అండ్ డి వేస్ట్ ను తరలించడంలో ఏ.ఎం.ఓ.హెచ్, డి.సి లు బాద్యతాయుతంగా పనిచేయాలన్నారు. చెరువుల పూడికతీత పనులు నిరంతరాయంగా నిర్వహించాలని, ఈ విషయంలో కార్పొరేటర్ల సహాయం తీసుకొని ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలన్నారు.  

   అన్ని జోన్ల మాదిరిగా చార్మినార్ లో కూడా పాత వస్తువుల సేకరణ చేపట్టాలని, జోన్ లోని కొన్ని ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాల్లో పాత వస్తువుల సేకరణ చేయాలన్నారు. మంజూరైన వైకుంఠదామాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని, శ్మశానవాటికల్లో మౌలిక సదుపాయాలు నీటి వసతి, బట్టలు మార్చుకునే గది, కంపౌండ్ వాల్ ఇతరాత్ర కనీస అవసరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలో చేపడుతున్న నాలా అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, ప్రభుత్వం ఈ కార్యక్రమంపై ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను మే మాసం చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ హరితహారం కింద చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని, మల్టీలేవల్ అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలలో కావాల్సిన మొక్కలను సిద్దం చేయాలన్నారు. ఎంటమాలజి శాఖ ద్వారా చెరువులు, ప్రభుత్వ పాఠశాలల్లో స్ప్రేయింగ్ ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జోన్ పరిధిలోని పాఠశాల ఆవరణలో శానిటేషన్ చర్యలు రోజువారిగా చేపట్టాలని సూచించారు. స్ట్రీట్ లైట్ల పనితీరును మెరుగుపర్చాలని, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం కూడా వీధి లైట్లు వెలుగుతున్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నందున అలాంటి చర్యలు పునరావృతం కాకూడదని కార్పొరేటర్లు కూడా ఈ విషయంలో విన్నవిస్తున్నందున ఎలక్ట్రిసిటీ అధికారులు ఎప్పటికప్పుడు కార్పొరేటర్ సహాయం తీసుకోవాలని సూచించారు.

యుసిడి ద్వారా చిరు వ్యాపారులకు నిర్దేశిత స్థలాల్లో వ్యాపారం చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా చేపట్టాలని, జోన్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను గుర్తించి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జోన్ లో ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.  

*నాలా అభివృద్ది పనులను పరిశీలించిన మేయర్*

ఎస్.ఎన్.డి.పి పనుల పరిశీలినలో భాగంగా మేయర్ ముందుగా అప్పా చెరువు వద్ద జరుగుతున్న పనులను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు శికం భూమిలో అక్రమంగా నిర్మించిన గృహాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాజేంద్రనగర్ తహశిల్దార్ ను పిలిపించి ఈ అక్రమ నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక అందజేయాలని తహశిల్దార్ ను ఆదేశించారు. అనంతరం చార్మినార్ జోన్ చందన గార్డెన్ నుండి సరూర్ నగర్ చెరువు వరకు రూ. 17 కోట్ల వ్యయంతో 3.50 కిలోమీటర్ల పొడవు చేపడుతున్న నాలా పనులను ఐఎస్ సదన్ వద్ద మేయర్ పరిశీలించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఐ.ఎస్.సదన్ కార్పొరేటర్ శ్వేత, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here