మార్చి లో 4 ప్రాజెక్టులు  అందుబాటులోకి

0
120
Spread the love

వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ఫలాలు మార్చి లో 4 ప్రాజెక్టులు  అందుబాటులోకి

హైదరాబాద్, ఫిబ్రవరి 22:  
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ఫలాలు మార్చి లో 4 ప్రాజెక్టులు  అందుబాటులోకి రానున్నాయి. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటు కు స్కై వేలు, మేజర్ కారిడార్లు,  ఫ్లై ఓవర్లు ఆర్ ఓ బి లు, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టి  ట్రాఫిక్ వ్యవస్థ మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రదేశాలలో నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ రహిత నగరంగా రూపొందించేందుకు ఎస్ ఆర్ డి పి (SRDP) పనులు దోహద పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కి విశేష కృషి చేస్తున్నారు. మార్చి మాసం లో SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. 2 అండర్ పాసులు మరో రెండు ఫ్లైఓవర్ లు అందుబాటులోకి రానున్నాయి  అందులో తుకారాం రైల్వే అండర్ పాస్, ఎల్ బి నగర్ ఆర్ హెచ్ ఎస్ అండర్ పాస్ లు బహదూర్ పుర, బైరమల్ గూడ ఎల్ హెచ్ ఎస్  రెండు  ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే బహదూర్ పుర నుండి ఉప్పల్ వరకు ట్రాఫిక్ రద్దీ  తగ్గడమే కాకుండా సురక్షిత  ప్రయాణంతో నిర్దేశిత గడువులోగా గమ్యాన్ని చేరే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా  కాలుష్యం తగ్గడంతో పాటుగా వాహన ఇంధన  పొదుపు చర్యలకు వీలవుతుంది. బైరమల్ గూడ  ఎల్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ 780 మీటర్  పొడవులో  400 మీటర్లు డక్ పోర్షన్  ఆర్ ఈ వాల్  12.50 మీటర్ల వెడల్పుతో నిర్మాణాలను చేపట్టారు. ఫ్లైఓవర్ పనులు ఫినిషింగ్ స్థాయిలో కలవు   మార్చి మాసం మొదటి వారం వరకు పూర్తి చేసి రెండో వారంలో  అందుబాటులోకి రానున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here