మంటగలిసిన మానవత్వం.. ఏసిబి వలలో జీహెచ్ఎంసీఅధికారిణి
హైదరాబాద్ మే 31 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );మానవత్వం లేని రీతిలో వ్యవహరించిన అధికారిణి ఏసిబి వలలో చిక్కుకుంది.వివరాల్లోకి వెలితే జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ మహాలక్ష్మి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మహిళా స్వీపర్ సాలెమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి మృతిచెందారు. దీంతో ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం డిమాండ్ చేశారు. ఆమె ఉద్యోగాన్ని.. ఆమె భర్తకు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీలో డీఈగా పని చేసే మహలక్ష్మీ దారుణంగా వ్యవహరించారు. భార్య పోయిన శోకంలో ఉండి.. బతుకుదెరువు కోసం ఉద్యోగాన్ని ఇవ్వమని అడిగితే.. లంచం అడిగారు. ఇందులో భాగంగా రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.ఈక్రమంలో మల్లాపూర్‌లోని ఓ హోటల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు అనుకున్నట్లుగా ఒక టిఫిన్ సెంటర్ కు ఈ ఉదయం వచ్చిన మహిళా అధికారిణి చేతికి రూ.20వేలు ఇవ్వటం.. ఆ వెంటనే ఏసీబీ అధికారులు అమెను అదుపులోకి తీసుకోవటం జరిగిపోయాయి. కాప్రా సర్కిల్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం జీహెచ్ఎంసీలో ఇప్పుడు సంచలనంగా మారింది.