డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తు దారులు అందుబాటులో ఉండాలి

0
135
Spread the love

డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తు దారులు అందుబాటులో ఉండాలి


హైదరాబాద్, ఆగష్టు 03:  
 జిహెచ్ఎంసి పరిధిలో ఇంతకు ముందు డబుల్ బెడ్  రూం ఇళ్ల  కొరకు దరఖాస్తు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలని జిహెచ్ఎంసి కోరింది. గతంలో చేసుకున్న దరఖాస్తులలో రిజర్వేషన్ కేటగిరి, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు,  ఓటరు పోటో  గుర్తింపు(EPIC) కార్డు లేవని తెలిపారు. అట్టి వివరాలు సేకరించుట కు గతంలో చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచిన/ సూచించిన అడ్రస్ కు రిజర్వేషన్ కేటగిరి, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు  , ఓటరు ఫోటో  గుర్తింపు కార్డు సేకరణ కు సంబంధిత దరఖాస్తు దారుని ఇంటి వద్దకు జిహెచ్ఎంసి సిబ్బంది, అధికారులు వస్తారాని, ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు ఇంటివద్దనే అందుబాటులో ఉండి వారికి అట్టి   సమాచారాన్ని అందజేయాలని జిహెచ్ఎంసి దరఖాస్తుదారులను కోరింది. ఈ విషయంలో అందరూ  సహకరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here