*20రోజుల్లోగా కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయ‌ని హోట‌ళ్ల‌కు రెడ్ నోటీసులు, వాట‌ర్ బంద్ – దాన‌కిషోర్‌*

0
133
Spread the love

*20రోజుల్లోగా కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయ‌ని హోట‌ళ్ల‌కు రెడ్ నోటీసులు, వాట‌ర్ బంద్ – దాన‌కిషోర్‌*

“రోజుకు 100 కిలోల వ్య‌ర్థాల‌ను ఉత్ప‌త్తి చేసే హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాళ్లు, క‌ళ్యాణ‌మండ‌పాలు, బాంకెట్ హాళ్ల‌లో 20రోజుల్లోగా కంపోస్ట్ ఎరువుల త‌యారీ యూనిట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేసుకోవాలని, లేన‌ట్టైతే త‌గు నోటీసులు జారీచేసి అవ‌స‌ర‌మైతే మంచినీటి క‌నెక్ష‌న్ల‌ను నిలుపుద‌ల చేస్తామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దానకిషోర్ హెచ్చ‌రించారు. 2016 వ్య‌ర్థ‌ప‌దార్థాల నిర్వ‌హ‌ణ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి 50 కిలోల వ్య‌ర్థాల‌ను రోజుకు ఉత్ప‌త్తి చేసే ప్ర‌తి సంస్థ త‌ప్ప‌ని స‌రిగా అంత‌ర్గ‌తంగా కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంద‌ని దాన‌కిషోర్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే ప‌లుమార్లు న‌గ‌రంలోని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాళ్ల య‌జ‌మానుల‌తో జీహెచ్ఎంసీ స‌మావేశాలు నిర్వ‌హించడం జ‌రిగింద‌ని నేడు న‌గ‌రంలోని హోటళ్లు, ఫంక్ష‌న్‌హాళ్లు, రెస్టారెంట్‌, బ్యాన్‌కెట్ హాళ్లు త‌దిత‌ర బ‌ల్క్ గార్బేజ్ యూనిట్ల య‌జ‌మానుల‌తో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ స‌మావేశం నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు హ‌రిచంద‌న‌, ర‌వికిర‌ణ్‌లు కూడా పాల్గొన్న ఈ స‌మావేశానికి దాదాపు 100కు పైగా బ‌ల్క్ గార్బేజ్ ఉత్ప‌త్తిచేసే హోట‌ళ్ల య‌జ‌మానులు హాజ‌ర‌య్యారు. 2016 ఎస్‌డ‌బ్ల్యూఎం నిబంధ‌న‌ల ప్ర‌కారం రోజుకు 50 కిలోల క‌న్నా అధిక మొత్తంలో చెత్త‌ను ఉత్ప‌త్తి చేసే వాటిని బ‌ల్క్ గార్బెజ్ జ‌న‌రేట‌రుగా ప్ర‌క‌టించామ‌ని, ఈ బ‌ల్క్ గార్బేజ్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌న్నీ ఆగ‌ష్టు 15వ తేదీలోగా త‌ప్ప‌నిస‌రిగా కంపోస్ట్ పిట్‌ల‌ను గానీ, కంపోస్ట్ యంత్రాల‌ను గానీ ఏర్పాటు చేసుకోవాల‌నే నిబంధ‌న‌ల‌ను విధించామ‌ని గుర్తుచేశారు. తాజా గ‌డువు అనంత‌రం కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయ‌ని హోట‌ళ్లు, రెస్టారెంట్‌లు, ఫంక్ష‌న్‌హాళ్లు, బాంకెట్ హాళ్ల‌కు రెడ్ నోటీసులు జారీచేయ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రవాసుల‌కు మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు అందించేందుకుగాను బ‌ల్క్ గార్బేజ్ సంస్థ‌లు విధిగా కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల‌నే నిబంధ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం విధించింద‌ని తెలిపారు. మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే కంపోస్ట్ ఎరువుల త‌యారీ యంత్రాల ధ‌ర‌లు, అవి దొరికే ప్రాంతాలు, విక్ర‌యించే సంస్థ‌ల వివ‌రాలతో కూడిన అంశాల‌తో న‌వంబ‌ర్ మొద‌టి వారంలో జోన్‌లవారిగా ప్ర‌త్యేక వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మ‌రింత మెరుగైన పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు జీహెచ్ఎంసీ చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు చేయుత‌నివ్వాల‌ని ఇందుకు గాను వెంటనె కాంపొస్ట్ యూనిట్లు యెర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ కోరారు. న‌గ‌రంలోని 3,4,5 న‌క్ష‌త్ర హోట‌ళ్ల‌న్నీ జీరో గార్బేజ్ ఉత్ప‌త్తికిగాను త‌ప్ప‌నిస‌రిగా కంపోస్ట్ యూనిట్ల‌ను ఏర్పాటు చేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌లు పాటించే హోట‌ళ్ల‌కు రెస్టారెంట్ల‌కు ప్ర‌త్యేక బ్రాండింగ్ గుర్తింపును జీహెచ్ఎంసీ జారీచేస్తుంద‌ని తెలియ‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here