పట్టణ ప్రగతి  తో సమస్యల పరిష్కారం

0
46
Spread the love

 

పట్టణ ప్రగతి  తో సమస్యల పరిష్కారం

హైదరాబాద్, జూన్ 06   గ్రేటర్ హైదరాబాద్ లో నాలుగుల పాటు  పట్టణ ప్రగతి ఉత్సాహవంతంగా జరిగింది. 30 సర్కిళ్లలో 150 వార్డులలో 583 కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.  పట్టణ ప్రగతిలో ఇప్పటి  వరకు19,542   కాలనీలలో దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగు చర్యలు చేపట్టారు.
పట్టణ ప్రగతి ద్వారా  పారిశుద్ధ్యం పచ్చదనం మెరుగుదల  అవుతున్నది.
అధికారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తో  ప్రజల సహకారం  తో   విజయ వంతం అవుతున్నది స్థానిక సమస్యలు గుర్తించి అక్కడిక్కడే పరిష్కారాన్ని మార్గం సుగమం అయ్యింది. ముఖ్యంగా మురుగు కాల్వలు,పూడిక తీత తో పాటు రక్షణ చర్యల చేపట్టారు.

పట్టణ ప్రగతిలో నాలుగో  రోజున  చేపట్టిన కార్యక్రమాలు

పారిశుధ్యం

 *  తొలగించిన మొత్తం చెత్త6631 మెట్రిక్ టన్నులు  ఇప్పటి వరకు 27,044 మెట్రిక్ టన్నులు.

* తొలగించిన భవన నిర్మాణ వ్యర్థాలు 2355 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు9236.9 టన్నులు.

* 146  కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల తొలగింపు ఇప్పటి వరకు632.58.కిలో మీటర్లు

*   డ్రైనేజి/ నాలాలో తొలగించిన పూడిక 25 కిలోమీటర్లు  ఇప్పటి వరకు85.03.

*  24 శిథిల భవనాల వ్యర్థాల తొలగింపు

*  21 పూడ్చిన లోతట్టు ప్రాంతాలు

* 4682 ప్రాంతాల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయడం జరిగింది.

* 142మంచినీటి ట్యాంక్ లు, పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది.

*   76 పార్కుల ఆవరణలో శుభ్రం చేయడం జరిగింది.


*  112కమ్యూనిటీ స్థలాలు, ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ భవన సముదాయాలు పరిశుభ్రం చేయడం జరిగింది.


*  1045 మరుగుదొడ్లు శుభ్రం చేయడం జరిగింది.

* 36 వైకుంఠదామాలు/ శ్మశానవాటికల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయడం జరిగిందిఇప్పటి వరకు157ఎంటమాలజి

* 113000 ఇళ్ళ లో  యాంటీ లార్వా చర్యలు చేపట్టనైనది.

* 1,04,000 లక్షల ఇళ్లలో ఫాగింగ్ చేయడం జరిగింది. 


గ్రీనరి


* 3142మొక్కలు నాటడం జరిగింది.


* 671  మీటర్లు రోడ్డు మధ్యలో (మీడియన్ ప్లాంటేషన్) మొక్కలు నాటడం జరిగింది.

* 1 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనైనది.

*  5766 ఇళ్లకు మొక్కలను పంపిణీ చేయనైనది.

* 1 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనైనది. 

* 2978  మొక్కలకు సాసర్ చేసి,  కలుపు తీయడం జరిగింది.

* పరిసర ప్రాంతాల్లో గ్రీనరి అభివృద్ధికి కృషి చేసిన 7  జంటలకు సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Read News Below

ఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభం

చీము నెత్తురు ఉంటే బిజెపీ నేతలు ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తేవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here