Spread the love
*పట్టణ ప్రగతి విజయవంతం*
*హైదరాబాద్, జూన్ 03:* పట్టణ ప్రగతి కార్యక్రమం నగరంలో విజయవంతమైంది. శుక్రవారం నాడు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అధికారులు, కమిటీ మెంబర్లు కలిసి కాలనీలో ఉన్న సమస్యలను గుర్తించారు. వాటిని దశలవారిగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీలో చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను, గ్రీన్ వేస్ట్ వెనువెంటనే తొలగించారు. కాలనీలో పరిశుభ్రత వాతావరణం కల్పించారు. యాంటి లార్వా నివారణకు స్ప్రేయింగ్ చర్యలు చేపట్టి దోమల నివారణకు అవగాహన కల్పించారు.
*పట్టణ ప్రగతిలో మొదటి రోజు చేపట్టిన కార్యక్రమాలు*
* 6837 మెట్రిక్ టన్నుల చెత్త ఎత్తివేయడం
* 2,188.47 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాల ఎత్తివేయడం
* 180.425 కిలోమీటర్ల మేర ముళ్ల పొదల తొలగింపు
* 21.608 కిలోమీటర్ల మేర నాలా పూడికతీత పనులు చేపట్టడం జరిగింది.
* శిథిలావస్థలో ఉన్న 6 భవనాలను కూల్చివేయడం జరిగింది.
* లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుంతలను పూడ్చడం జరిగింది.
* 1,32,000 ఇళ్లలో స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయడం జరిగింది.
* 25 మంచినీటి ట్యాంక్ లను శుభ్రం చేయడం జరిగింది.
* 70 పార్కులను శుభ్రం చేయడం జరిగింది.
* 106 కమ్యూనిటీ భవనాలను పరిశుభ్రం చేయడం జరిగింది.
* 1126 మరుగుదొడ్లను శుభ్రం చేయుడం జరిగింది.
* 36 వైకుంఠదామాలు/ శ్మశానవాటికలలో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేయడం జరిగింది.
*ఎంటమాలజి*
* 1,32,000 యాంటి లార్వ చర్యలు చేపట్టనైనది.
* 1.44 లక్షల ఇళ్లలో ఫాగింగ్ చేయడం జరిగింది.
*గ్రీనరి*
* 11,676 మొక్కలు నాటడం జరిగింది.
* 1,605 మీటర్ల మీడియన్ ప్లాంటేషన్ చేపట్టనైనది.
* 3.32 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనైనది.
* 3177 హోం స్టేడ్ మొక్కలను పంపిణీ చేయనైనది.
* 0.57 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనైనది.
* 6,330 మొక్కలకు సాసర్ చేసి, కలుపు తీయడం జరిగింది.