*ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు మరో వారం రోజుల గడవు మాత్రమే*

0
196
Spread the love

*ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేందుకు మరో వారం రోజుల గడవు మాత్రమే*

*హైదరాబాద్, మార్చి 24:*  గ్రేటర్ హైదరాబాద్ లో 2019 -20 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఆస్తి పన్ను బాకాయిలపై ఉన్న వడ్డీ ని 90 శాతం వరకు మాఫీ చేసే వన్ టైం సెటిల్మెంట్ పథకం క్రింద ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు  మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 31వ తేదీలోపు తమ ఆస్తిపన్ను బకాయిలను చెల్లించి బకాయిలపై వడ్డీ రాయితీని వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి కోరింది. కాగా 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1900 కోట్ల ఆస్తిపన్ను సేకరించాలని జిహెచ్ఎంసి లక్ష్యాన్ని విధించగా నేటి వరకు రూ. 1484.10 కోట్లను సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా మిగిలిన ఆస్తిపన్ను బకాయిలను పొందేందుకు జిహెచ్ఎంసి పెద్ద ఎత్తున ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లోఇంకా తమ ఆస్తిపన్ను బకాయిలను చెల్లించని వారికి వెంటనే మీ ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని వారి సెల్ ఫోన్ లకు సంక్షిప్త సమాచారాన్ని జీ.హెచ్.ఎం.సి పంపింది. ఆస్తి పన్ను బకాయిలను జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లలో గాని, మీసేవా లోగాని, ఆన్-లైన్ , మైజీహెచ్ఎంసీ ఆప్ లోగానీ చెల్లించవచ్చని జీహెచ్ ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here