యువత ఉపాధి కోసం నైపుణ్యత శిక్షణ కు జిహెచ్ఎంసి కృషి

0
72
Spread the love
యువత ఉపాధి కోసం నైపుణ్యత శిక్షణ కు జిహెచ్ఎంసి కృషి

ప్రతి యేటా 600 మందికి ఉచితంగా  నైపుణ్యత శిక్షణ

మహిళలకు ప్రాముఖ్యత

ప్రయోగాత్మకంగా కూకట్ పల్లి జోన్ లో ఏర్పాటు


స్లమ్ ఏరియా లో గల నిరుద్యోగ యువతకు యుద్ద ప్రాతిపదికన ఉపాధికి ప్రణాళిక


హైదరాబాద్, జూలై 15: 
  నగరంలో మురికి వాడలో నివసిస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరమైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.

 స్లమ్ ఏరియా లో నివసించే యువత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాక ఉపాధిలో వెనుకబడిన వారందరికీ  జిహెచ్ఎంసి  చేయూత అందిస్తున్నది.

  నగరం లో స్లమ్ ఏరియా లో నివసించే 18 సంవత్సరాల వయస్సు నుండి 35 సంవత్సరాల వయస్సు గల వారందరికీ స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో ప్లేస్ మెంట్ ద్వారా ఉపాధి కల్పించేందుకు నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలకు అనుభవం గల పూణేకు చెందిన  లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (LCF) సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ప్రయోగాత్మకంగా కూకట్ పల్లి జోన్ లో  ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది.

ఈ సంస్థతో జిహెచ్ఎంసి ఎం.ఓ.యు చేసుకోవడానికి స్టాండింగ్ కమిటీ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది.  నైపుణ్యత శిక్షణ కార్యక్రమంలో 18 సంవత్సరాల వయస్సు నుండి  35 సంవత్సరాల వయస్సు గల వారికి కనీస విద్య అర్హత గల వారందరికీ ఇష్టమైన ఆసక్తి గల రంగాల్లో వారిని నిష్ణాతులు చేసి  లైట్ హౌస్ వారి వివిధ భాగస్వామ్య  సంస్థలలో ఉపాధి కల్పిస్తుంది. ఇంతకు ముందు ఈ సంస్థ పూణే నగర పాలక సంస్థతో ఒప్పందం చేసుకొని వేలాది మందికి ఆయా భాగస్వామ్య  సంస్థల ద్వారా గాని ఆయా పరిశ్రమలు,  కంపెనీలలో ఉపాధి  కల్పనకు కృషి చేసింది. ఎలాంటి  విద్య అర్హత  లేకపోయినా వారికి కూడా స్వయం ఉపాధి పెట్టుకునేందుకు ప్రోత్సాహంతో పాటు అవసరమైన పరిజ్ఞానాన్ని కల్పించి, అవసరమైన కావలసిన ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తారు.

లైట్ హౌస్ సంస్థ  మహారాష్ట్రలోని పూణే నగర పాలక సంస్థతో యువతకు అందిస్తున్న నైపుణ్య శిక్షణ ద్వారా అనేక మందికి ఆసక్తి గల రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం తో వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసింది. 
కేటగిరీ కోర్సులు
1. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ : ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ – ఎస్.ఎస్.ఎఫ్
2. లాంగ్ స్టిక్ సెక్టార్ (cce/ process executive) లాంగ్ స్టిక్  సెక్టార్ సర్టిఫికెట్ కోర్సు
3. అకౌంట్ ఎగ్జిక్యూటివ్: అకౌంట్ ఎక్జిక్యూటివ్ – ఎల్.సి
4. ఆఫీస్ ఎగ్జిక్యూటివ్: ఆఫీస్ ఎక్జిక్యూటివ్ – ఎల్.ఆర్
5. BFSI  బిజినెస్ డెవలప్మెంట్ ఎక్జిక్యూటివ్ 
6. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, వెబ్ డిజైనింగ్, జావా  ఫుల్ స్ట్రక్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్, పైథాన్ – టా ఫిట్, కోర్ జావా – టా ఫిట్
7. వెబ్ డెవలప్మెంట్: వెబ్ పొగ్రంతో పాటు పి.హెచ్.పీ, అంగుళర్ – టా ఫిట్ 
8. నర్సింగ్ అసిస్టెంట్, కేర్, రికవరీ, హోమ్ కేర్ , సర్టిఫికెట్ కోర్సులు.

ఎలక్ట్రీషియన్  కోర్సులు

1. ఎలక్ట్రీషియన్
2. సర్టిఫికెట్ కోర్సు లు, ఎలక్ట్రికల్ వైర్ మెన్ ట్రేడ్, ఎలక్ట్రికల్ సర్వీస్

కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ కోర్సులు

1. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ సర్టిఫికెట్ కోర్సు
2. కంబో – హార్డ్వేర్  నెట్వర్కింగ్.
3. మొబైల్ రిపేరింగ్ 
ఫిట్నెస్ ట్రైనర్ అండ్ న్యూట్రిషన్
1. న్యూట్రిషన్  ఎక్స్  పర్ట్, ఫిట్నెస్ ట్రైనర్ కమ్ న్యూట్రిషన్ ఎక్స్  పర్ట్( కాంబో కోర్స్)
12. హోం అప్లియాన్స్ కోర్స్, హోమ్ అప్లయెన్సెస్ రిపేరింగ్  సర్టిఫికెట్ కోర్సు
13. హోమ్ అప్లయెన్సెస్ రిపేరింగ్ కోర్స్
14. బ్యూటీ అండ్ వెల్నెస్, బేసిక్ అండ్ బ్యూటీ పార్లర్, బ్యూటీ అండ్ కాస్మోటో లోజి.
15. గ్రాఫిక్ అండ్ వెబ్  డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామ్, గ్రాఫిక్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ సర్టిఫికేట్ కోర్స్
16. ఎల్డర్లి కేర్ గివర్ కోర్సు లను ఆఫర్ చేస్తున్నది.

 ఈ నేపథ్యంలో IT, ITes ( information technology enable services)  సంబంధించిన ప్రోగ్రాం జావా, సి సి ఎన్ ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్, నాన్ వాయిస్ బి పీ ఓ బ్లూ కలర్  కోర్సు,  వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్  జనరల్ డ్యూటీ  అసిస్టెంట్, రెండు, మూడు, నాలుగు చక్రాల  వాహనాలకు సంబంధించిన  రిపేరింగ్, ఫోటోగ్రఫీ, మొబైల్ రిపేరింగ్, బేకరి తయారీ లాంటి ఇతర ప్రోగ్రాములు ఎన్రోల్మెంట్  అయిన వారికి  నైపుణ్యత కల్పిస్తారు.

నర్సింగ్, కుక్కింగ్, బ్యూటీ పార్లర్ లు, ఫిట్నెస్ ట్రైనర్ సేర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సుల్లో శిక్షణ కల్పిస్తారు. ఇవే కాకుండా  అభ్యర్థులకు ఆసక్తి ఇష్టమైన కోర్సులకు ఈ సంస్థ వద్ద లేకున్నా వేరే  ట్రైనింగ్ సెంటర్ కు   పంపించి అట్టి ఫీజు కూడా  సంస్థ చెల్లించి  యువతకు శిక్షణ  కల్పించేందుకు కృషి చేస్తారు  ఎంపిక నుండి నైపుణ్యత, శిక్షణ తో పాటు ప్లేస్మెంట్ ఇప్పించే వరకు బాధ్యత తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల నిర్వహణకు భాగస్వామ్యం పెద్ద, పెద్ద సంస్థలతో పాటుగా పుణె ప్రాంతంలో లోకల్ స్థాయి సంస్థలతో కూడా భాగస్వామ్యం చేసుకొని ఉపాధి కల్పించారు.

 హైదరాబాద్ లో కూడా భాగస్వామ్య దిగ్గజ సంస్థలతో పాటుగా అదే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న కంపెనీలు, పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ హౌస్ ఫౌండేషన్ పూణే మునిసిపాలిటీలలో 11,000 మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 7,200 మందికి ప్లేస్ మెంట్ తో పాటుగా స్వయం ఉపాధి కల్పించారు. ప్రతి ఏటా సుమారు 600 మందికి సర్టిఫికెట్ కోర్సులలో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా  శిక్షణ కల్పిస్తారు.
 
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో స్లమ్ లో నివసించే యువత జీవన ప్రమాణాలను పెంపొందించే సంకల్పం తో లైట్ హౌజ్ కమ్యూనిటీ ఫౌండేషన్ ముందుకు రావడంతో వీరి పని తీరును పరిశీలన చేసేందుకు ప్రయోగాత్మకంగా కూకట్ పల్లి జోన్ ఏర్పాటు కు నిర్ణయించారు. స్లమ్ ఏరియా లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరత జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ముందుకు వచ్చిన లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ కి సర్కిల్ 21 లో గల హుడా కాలనీ లో గల  మోడల్ మార్కెట్ బిల్డింగ్  కేటాయించి   పైలట్ ప్రాజెక్ట్ గా ఒక సంవత్సరం పాటు నిర్వహించుకునేందుకు ఎలాంటి అద్దె లేకుండా జిహెచ్ఎంసి అవకాశం ఇవ్వడం జరిగింది.

జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 4846 కాలనీలలో  సుమారు 1466 నోటిపైడ్, నాన్ నోటి ఫైడ్  స్లమ్ ఏరియా లో ఉన్న నేపథ్యంలో స్లమ్ లో ఉన్న అన్ని కాలనీలలో  నిరుద్యోగ యువతీ యువకులకు సుస్థిర జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యుద్ద ప్రాతిపదికన  జిహెచ్ఎంసి చర్యలు చేపట్టి అందుకు కావలసిన ప్రణాళికను తయారు చేస్తున్నారు..
 
 
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here