స్టాండింగ్ కమిటీ సమావేశంలో 29 అంశాల‌ ఆమోదం

0
94
Spread the love

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (తూఫాన్‌) నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం 5వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 29 అంశాలకు గాను 29 అంశాలు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, ముస్తఫా బేగ్, ప్రవీణా సుల్తాన, బతా జబీన్, విజయ్ కుమార్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మందడి శ్రీనివాస రావు, వై.ప్రేమ్ కుమార్, సామల హేమ, కుర్మ హేమలత, కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లు పౌసమి బసు, శృతి ఓజా, యు.బి.డి అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్లు, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, ఎస్.ఆర్.డి.పి సి.ఇ దేవానంద్, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సిపి శ్రీనివాస్, హౌసింగ్ ఓ.ఎస్.డి సురేష్, ఎల్.ఏ వెంకటేశ్వర్లు, ఏ.సి ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ కెనడి, అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


*స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలు…*


* రీవైస్డ్ ఆర్.డి.పి కింద రాంనగర్ నుండి అంబేద్కర్ కాలేజ్ జంక్షన్ వయా వి.ఎస్.టి జంక్షన్ వరకు సెకండ్ లేవల్ ఫ్లైఓవర్, 15 మీటర్లు, 24 మీటర్లు, 27.8 మీటర్లు, 30 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 39 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.

* ఆర్.డి.పి కింద నేషనల్ హైవే 65 ముంబాయి (అశోక గోల్డెన్ మాల్) నుండి గ్రీన్ హిల్స్ రోడ్ వయా ఐ.డి.ఎల్ లేక్, ఐ.డి.ఎల్ ఎక్స్ ప్లోజివ్ లిమిటెడ్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 10 ఆస్తుల సేకరణకు, కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ఐ.డి.ఎల్ లేక్ వయా ఎన్.ఆర్.సి గార్డెన్, ద క్రీక్ ప్లానెట్ స్కూల్ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 43 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.

* ఆర్.డి.పి కింద ఫరూక్ నగర్ బస్ డిపో నుండి వట్టేపల్లి వయా ఫాతిమా నగర్ 12 మీటర్లు, 18 మీటర్లు, 24 మీటర్ల రోడ్డు వెడల్పు నకు, హెచ్.టి లైన్ కు ఇరువైపులా 10 మీటర్ల రోడ్డు వెడల్పు నకు మాస్టర్ ప్లాన్ లో పొడగించడానికి, 174 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.

* ఆర్.డి.పి కింద సాయి ఎన్ క్లేవ్ నుండి కాప్రా చెరువు వయూన్ మిడోస్ వెంచర్స్, శివ సాయి నగర్ 12 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 13 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.

* ఆర్.డి.పి కింద ఐ.జి విగ్రహం నుండి బొల్లారం – కోంపల్లి వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 408 ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.


* ఆర్.డి.పి కింద బిస్మిల్లా హోటల్ నుండి డి.ఆర్.డి.ఓ కాంపౌండ్ వాల్ వరకు 9 మీటర్ల రోడ్డు వెడల్పు నకు 118 ఆస్తుల సేకరణకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం.

* రాజేంద్రనగర్ శాస్త్రీపురం ఆలీ భాయ్ క్రాస్ రోడ్ వద్ద కాంప్రహెన్సివ్ డెవలప్ మెంట్ స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు రూ. 5.95 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం.


* అర్భన్ బయోడైవర్సిటీ వింగ్ క్రింద ఆరుగురు రిటైర్డ్ ఆఫీసర్స్ (ఫారెస్ట్ అండ్ ఉద్యాన శాఖ) ఒక సంవత్సరం పాటు 01-12-2021 నుండి ఔట్ సోర్సింగ్ పద్దతిన కొనసాగించడానికి పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం.

* జిహెచ్ఎంసి పరిధిలో వివిధ సర్కిళ్లలో స్థలమార్పిడి, వివిధ పనుల నిర్వహణకు ప్రతిపాదనలను తిరిగి పంపేందుకు ఆమోదం.

* జిహెచ్ఎంసి ఉద్యోగులకు 01-01-2020 నుండి 01-07-2020 మరియు 01-01-2021 వరకు డి.ఏ ను 01 జూలై 2021 నుండి 7.28 % నుండి 17.29% (10%) పెంపు చేసేందుకు జి.వో ను అమలు చేసేందుకు ప్రతిపాదనలు.

* జిహెచ్ఎంసి ఫెన్షనర్స్ 01-01-2020 నుండి 01-07-2020 మరియు 01-01-2021 వరకు డి.ఏ ను 01 జూలై 2021 నుండి 7.28 % నుండి 17.29% (10%) పెంపు చేసేందుకు జి.వో ను అమలు చేసేందుకు ప్రతిపాదనలు.

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి విలేజ్ కోమటి కొండ చెరువు సంరక్షణ కోసం రిస్టోరేషన్, సీవరేజ్ డైవర్షన్ కు రూ. 265.50 లక్షలకు పరిపాలన అనుమతులకు ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి విలేజ్ గోసాయి కుంట చెరువు సంరక్షణ, రిస్టోరేషన్ సీవరేజ్ పనులకు రూ. 289 లక్షలు పరిపాలన అనుమతులకు ఆమోదం.,

* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నంద నగర్ విలేజ్ హెచ్.ఎం.టి లేక్ సీవరేజ్ డైవర్షన్, డెవలప్ మెంట్, బ్యూటిఫికేషన్ కోసం రూ. 2.74 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లింగంపల్లి గ్రామం గోపి చెరువు డ్రైనేజి డైవర్షన్ కోసం రూ. 2.26 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.


* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం లాల్ సాబ్ గూడ విలేజ్ రామన్న చెరువు అభివృద్ధికి రూ. 2.17 కోట్లు పరిపాలన అనుమతులకు ఆమోదం.

* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలం, గ్రామం చిన్నరావిని చెరువు అలుగు, తూము నిర్మాణం, పునరుద్దరణ పనులు, సీవరేజ్ డైవర్షన్ కోసం రూ. 2.39 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మల్కాజ్ గిరి మండలం, గ్రామం బండ చెరువు దగ్గర ఇన్ లెట్ అవుట్ లెట్ పునరుద్దరణ పనులు, సీవరేజ్ డైవర్షన్ కోసం రూ. 2.40 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం విలేజ్ పెద్ద చెరువు వద్ద అలుగు, తూము, వాకింగ్ ట్రాక్, సీవరేజ్ డైవర్షన్ నిర్మాణం కోసం రూ. 2.96 కోట్లు పరిపాలన అనుమతులకు ఆమోదం.

* మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం కొత్త కుంట చెరువు అభివృద్ధి, డ్రైనేజి డైవర్షన్ నిర్మాణానికి రూ. 2.33 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం, గ్రామం తిమ్మక్క చెరువు అలుగు, తూము పునరుద్దరణ పనులు, డ్రైనేజీ డైవర్షన్ నిర్మాణం పనులకు రూ. 2.43 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మక్తా మహబూబ్ పేట్ మేడికుంట బి.కె.ఎన్ క్లేవ్ లేక్ అలుగు, చెయిన్ లింక్ మెష్, డ్రైనేజి డైవర్షన్ పనులకు రూ. 2.13 కోట్ల పరిపాలన అనుమతులకు ఆమోదం.

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపన్ పల్లి విలేజ్ చిన్న పెద్ద చెరువు అలుగు కు మరమ్మతులు, డ్రైనేజి డైవర్షన్ కోసం రూ. 2.29 కోట్ల పరిపాలన మంజూరుకు ఆమోదం.

* జిహెచ్ఎంసి చట్టం ప్రకారం జిహెచ్ఎంసికి సంబంధించిన 31 జనవరి 2022 వరకు ఆదాయ, వ్యయ స్టేట్ మెంట్ రిపోర్ట్ సమర్పించేందుకు ఆమోదం.


* రాజేంద్ర నగర్ మెయిన్ రోడ్డు నుండి గ్రీన్ వాక్ వే (జిహెచ్ఎంసి పరిధి) వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పు నకు, కల్వర్ట్ నుండి గ్రీన్ వాక్ వే (జిహెచ్ఎంసి పరిధి) 500 మీటర్ల పొడవు మార్పునకు మాస్టర్ ప్లాన్ లో పొందుపరచడానికి ఆమోదం. ఇందుకు గాను ఆరు ఆస్తుల సేకరణ కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.


* మహా జరీన్ క్యాంప్ నుండి జూలుకన్న వరకు 40 మీటర్ల ఇంటర్నల్ రోడ్డు కోసం ప్రభుత్వానికి రాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు, మాస్టర్ ప్లాన్ లో చేర్చడం కోసం కమిటీ ఆమోదం. ఇందుకు గాను రెండు ఆస్తుల సేకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం.


* కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బుల్ (సి.ఎస్.ఆర్) కింద షేక్ పేట్ కొత్త చెరువు లేక్ దత్తత, అభివృద్ధి కి రోటరీ క్లబ్ హైదరాబాద్ ద్వారా పనులు, వ్యయం చేయడానికి పరిపాలన సంబంధిత ఆమోదం.


* కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బుల్ (సి.ఎస్.ఆర్) శేరిలింగంపల్లి మండల్ నానక్ రాం గూడ గ్రామం, రంగులాల్ కుంట డెవలప్ మెంట్, కన్జర్వేషన్ పనులు 24 నెలల వ్యవధిలో పూర్తి చేయుటకు యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జిహెచ్ఎంసి కమిషనర్ సంయుక్తంగా ఎం.ఓ.యూ పై కమిషనర్ సంతకానికి ఆమోదం.


* కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బుల్ కింద శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ విలేజ్ కొత్త కుంట చెరువు సుందరీకరణ పనుల కోసం 24 నెలల వ్యవధిలో పూర్తి చేయుటకు యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జిహెచ్ఎంసి కమిషనర్ సంయుక్తంగా ఎం.ఓ.యూ పై కమిషనర్ సంతకానికి ఆమోదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here