స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు కమిటీ ఆమోదం

0
71
Spread the love
స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు కమిటీ ఆమోదం
 
 
*హైదరాబాద్, మే 31:*   నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా  మేయర్ మాట్లాడుతూ 11వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని అన్నారు.
 
ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అడిషనల్ శృతి ఓజా, కెనడీ, ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్, సి సి పి దేవేందర్ రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ సి.పి శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్లు శంకరయ్య, రవికిరణ్, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. 
 
స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, మహ్మద్ రషీద్ ఫరాజుద్దిన్, సి.ఎన్.రెడ్డి,  మద్ది శ్రీనివాస్ రావు, సామల హేమ, కుర్మ హేమలత తదితరులు పాల్గొన్నారు. 
 
స్టాండింగ్ కమిటీ లో ఆమోదించిన అంశాలు…

*   లైట్ హౌస్ కమ్యూనిటీ  ఫౌండేషన్  ఆధ్వర్యంలో స్లమ్ ఏరియా లో ఉంటున్న 35 సంవత్సరాల లోపు 600 మంది యువతకు స్కిల్ డెవలప్ మెంట్ లో  శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించేందుకు గాను చంద నగర్ సర్కిల్  21 లో నున్న  హుడా కాలనీ లో గల  మోడల్ మార్కెట్ బిల్డింగ్ నందు శిక్షణ తరగతులు   కోసం ఒక సంవత్సరం పాటు   ఇచ్చేందుకు    పైలెట్ ప్రాజెక్టు  క్రింద  ఎం.ఓ.యు చేసుకొనుటకు అనుమతికి కమిటీ ఆమోదం.

* జి.వి.కె, ఈఎంఆర్ఐ ద్వారా నిర్వహిస్తున్న డయల్ 100 సర్వీసును   జి హెచ్ ఎం సి ద్వారా రిజిస్టర్ అయిన 38 శాతం రిజిస్టర్డ్ కాల్స్ కు, మరో మూడు సంవత్సరాలు పొడిగింపు కోసం (జూన్ 2022 నుండి 20 మే 2025 వరకు ) జివికె, ఈఎంఆర్ఐ ఆవరణలో ఉన్న డయల్ 100 కమాండ్ కంట్రోల్ సెంటర్ ను  ఆపరేషన్, మెయింటెనెన్స్  కోసం  10 శాతం వార్షిక పెంపు సందర్భంగా    రూ. 99,39,641 అంచనా వ్యయాన్ని చెల్లించేందుకు  పరిపాలన అనుమతి కి ఆమోదం.

* కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ, క్రింద  బాల నగర హాల్ లిమిటెడ్   సంస్థ       2022 -23 ఆర్థిక సంవత్సరం లో 300 కోట్లు, 2023-2024 కు 100 కోట్లు ,  2022 – 2024  రెండు సంవత్సరం లో మొత్తం 400 కోట్లు  ఇవ్వనున్నందున అట్టి నిధులతో  కైతలాపూర్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద బయో  వేస్ట్ కోసం   బయో గ్యాస్ ప్లాంట్   ఏర్పాటు నుండి  సి ఎన్ జి గ్యాస్ తయారు ప్లాంట్ ఏర్పాటు కు టెండర్ పిలుచెందుకు  అనుమతి తో   పాటు ఒప్పందం చేసుకొనుటకు   కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు  అథరైజేషన్ ఇచ్చుటకు కమిటీ ఆమోదం.

* రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ కింద లింక్ రోడ్డున హబ్సిగూడ  వద్ద  సుదర్శన్ రెడ్డి స్వీట్  హోమ్  కార్నర్ నుండి కిమిడి కాలనీ లోపలి వరకు ,  బ్యాంక్ బరోడా కాలనీ కుడి భాగం వరకు నాచారం వరకు కనెక్ట్ చేస్తూ 18 మీటర్ల వెడల్పు కొరకు  203 ఆస్తుల సేకరణకు ఆమోదం.

*  ఖైరత బాద్ జోన్ లోని మల్లేపల్లి  సర్కిల్ 12 లో గల  శిథిలావస్థలో ఉన్న జకీర్ హుస్సేన్ కమ్యూనిటీ హాల్   ను రూ.590   లక్షల వ్యయంతో చేపట్టే  మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం,    మౌలిక సదుపాయాలు కల్పన, మొత్తం 1609 స్క్వేర్ మీటర్లు  ఉన్న దాని లో   675  స్క్వేర్ మీటర్ నుండి  800 స్క్వేర్  మోటార్  ప్లింత్ ఏరియా నుండి  వృద్ధి చేయుటకు  కమిటీ ఆమోదం.


* ఖైరతాబాద్ జోన్, సర్కిల్-12 గుడిమల్కాపూర్ 71 వార్డు, పి.వి.ఎన్.ఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ పిల్లర్  56  వద్ద గల  608 మీటర్ల విస్తీర్ణంలో  రూ.600 లక్షల అంచనా వ్యయం తో సర్కిల్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మించేందుకు ఆమోదం.

* శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి విలేజ్ సర్వే నెం.37, 34 శిల్పా పైనీర్ వద్ద పార్కును ఒక సంవత్సరం పాటు సి.ఎస్.ఆర్ కింద మెయింటెనెన్స్ చేసేందుకు ఫొనిక్స్ టెక్నో ప్రై.లిమిటెడ్ తో  అడిషనల్ కమిషనర్ సి ఎస్ ఆర్  కు   ఎం.ఓ.యు చేసేందుకు అనుమతి  జారీ చేస్తూ కమిటీ ఆమోదం.

*  సి.ఎస్.ఆర్ కింద శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్   సర్కిల్  నెంబర్ 20 సర్వే నెంబర్  64   హుడా టెక్నో ఎన్ క్లేవ్  అనుకోని ఉన్న  పార్కుల సుందరీకరణ, నిర్వహణ కోసం  ఒక సంవత్సరం పాటు చేపట్టేందుకు ఎల్.ఎన్.బి రియాల్టీ, ఎల్.ఎల్.పి  అడిషనల్ కమిషనర్ సి ఎస్ ఆర్ కు  ఎం.ఓ.యు కు అనుమతి ఇస్తూ  కమిటీ  ఆమోదం.

*  చార్మినార్ జోన్ చాంద్రాయణగుట్ట   సర్కిల్ నంబర్ 8 లో చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ నుండి  మొగల్ కాలనీ వరకు రూ. 600 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే   మోడల్ కారిడార్  నిర్మించేందుకు  కమిటీ ఆమోదం.

* పి.వి.ఎన్.ఆర్ ఫ్లైఓవర్ పిల్లర్ నెం.143 రాంబాగ్ గోల్డెన్ కేఫ్ నుండి బహదూర్ పుర జంక్షన్ వయా కిషన్ బాగ్ రోడ్డు వరకు  30  ఫీట్లు వెడల్పు చేసేందుకు  278 ఆస్తుల సేకరణకు ఆమోదం.

* ఆర్.డి.పి కింద ఐ.ఎస్.సదన్ జంక్షన్ నుండి బైరమల్ గూడ జంక్షన్ వయా చంపాపేట్, కర్మన్ ఘాట్ వరకు  45 మీటర్లు, 60 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా ఇందిరా సేవ సదన్ నుండి సర్కిల్ 7 లిమిట్స్ వరకు 45 మీటర్ల వెడల్పు చేసేందుకు 135 ఆస్తులు, సర్కిల్ 7 లిమిట్స్ నుండి బైరమల్ గూడ  వరకు 60 మీటర్ల రోడ్డు వెడల్పు కొరకు 183 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం. 

*  నల్లగొండ క్రాస్ రోడ్స్ వద్ద  వికాసం కార్యక్రమం నిర్వహణకు నేషనల్ సెన్సార్ పార్క్ నిర్వహణ, ఎన్.జి.ఓ, ఏ.ఇ.ఎస్ సర్వీసుకు 75 శాతం షేర్ రూ.21.15 లక్షలు అయేషా ఎడ్యుకేషన్ సర్వీస్ కు 20-09-2021 నుండి 19-09-2024 మూడు సంవత్సరాల పాటు జరిగే ఖర్చు చెల్లించుటకు కమిటీ ఆమోదం.

*  దివ్యాంగులు, సీనియర్ సిటీజన్లకు అలీమ్ కో సంస్థ ద్వారా సహాయ, ఉపకరణాలు ఆర్టిఫిషియల్  లింబ్స్   జిహెచ్ఎంసి  నిధులతో అందించేందుకు  క్యాంపు లు  నిర్వహణ కోసం అలింకో స్వచ్ఛంద సంస్థ కు నిర్వహించుటకు అనుమతి కి ఆమోదం.

* ఖైరతాబాద్ జోన్ సనత్ నగర్  దాసారం బస్తీ  లో  వార్డు 100  సర్కిల్ 17లో  రూ. 600 లక్షల అంచనా  వ్యయం తో  మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్( కన్వెన్షన్  సెంటర్)  నిర్మించేందుకు పరిపాలన సంబంధిత అనుమతికి ఆమోదం.


* చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ ద్వారా  ఏప్రిల్ 30  ఆదాయం మరియు ఖర్చు స్టేట్మెంట్ వివరాలు కమిటీ ఆమోదం.
 
*  ఖైరతాబాద్ జోన్ కార్బన్ సర్కిల్ జంజం కిరానా మరియు జనరల్ స్టోర్ జీషన్ కేఫ్ టోలిచౌకి వద్ద ఎస్ డబ్ల్యూ డి 1200 ఎం.ఎం డయా NP3 పైప్ లైన్ రూపాయలు 213 లక్షలతో వేసేందుకు పరిపాలన ఆమోదం కోసం కమిటీ ఆమోదం.

* ఎల్బీనగర్ జోన్ పటేల్ నగర్ ఎస్.పి.టి నుండి డి మార్ట్ ఉప్పల్ భగాయత్  లే అవుట్ వరకు రూ 490 లక్షలతో సిసి రోడ్డు నిర్మించేందుకు కమిటీ ఆమోదం.

*  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖజానా గ్రూప్ ద్వారా ఖైరతాబాద్ zone  బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ వద్ద  జిహెచ్ఎంసి ఓపెన్  స్పేస్ నందు గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు చేసేందుకు కమిషనర్ అనుమతి, కమిటీ ఆమోదం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here