చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్నిపెంపొందించేందుకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు

0
65
Spread the love
*చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్నిపెంపొందించేందుకు వేసవి క్రీడా శిక్షణ తరగతులు*

 
*1.20 కోట్ల రూపాయల విలువగల  స్పోర్ట్ మెటీరియల్*

*800 మంది  కోచ్ లతో శిక్షణా తరగతులు*


*ఏప్రిల్ 25 నుండి ప్రారంభమై మే 31 ముగుస్తాయి*


*హైదరాబాద్, ఏప్రిల్ 23:*   రాష్ట్రంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్ లో నిర్వహించని విధంగా  జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో వేసవి కాలంలో  పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడల ఆసక్తితో పాటుగా వివిధ క్రీడల పట్ల నైపుణ్యత పెంపొందించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. ఈ సంవత్సరంలో  క్యాచ్ ఏమ్ యంగ్ అనే స్ఫూర్తితో  సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను జిహెచ్ఎంసి నిర్వహిస్తున్నది.
 
ఈ నేపథ్యంలో ఈ వేసవి కాలంలో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయస్సు గల  పిల్లలకు ఏప్రిల్ 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు నగర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలలో క్రీడా ప్రాంగణంలో  క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంప్రదాయ, ఆధునాతన మొత్తం 44 క్రీడలలో శిక్షణ తరగతులు 854 ప్లే గ్రౌండ్ లలో ఏర్పాటు చేశారు. అందుకోసం  శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారు జిహెచ్ఎంసి www.sports.ghmc.gov.in  పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. అందుకు నామినల్ ఫీ కూడా చెల్లించవలసి ఉంటుంది. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ క్రీడ లకు రూ. 50,  మిగతా క్రీడలకు 10 రూపాయలు ఫీ  చెల్లించవలసి ఉంటుంది.

వేసవిలో క్రీడల నిర్వహణకు క్రీడా మైదానాలలో,  ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం శిక్షణ తరగతులు నిర్వహించబడలేదు. అందుకోసం జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న క్రీడా మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో కావలసిన సదుపాయాలను  కల్పించడం జరిగింది.

*క్రీడలు – శిక్షణ*

అథ్లెటిక్స్, ఆర్య పత్య, అర్చెరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖో ఖో,  కోర్ట్ బాల్, మాల్కంబ, నెట్ బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సేపక్ టాక్ర, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, తైక్వాండో, టంగ్ అఫ్ వార్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, ఇండియన్ రెజ్లింగ్,  రోమన్ రెజ్లింగ్,  వుషు, యోగ, బీచ్ వాలీ బాల్, త్రో బాల్, కిక్ బాక్సింగ్, ముఅయ్ థాయ్,స్క్వే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్  ఆట లలో శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యం లో క్రీడా శిక్షణ తరగతులను ప్రారంభోత్సవాలు, ముగింపు సమావేశాలు జరుగుతాయి.
 

*వేసవి క్రీడా శిక్షణ ప్రారంభం*
 
 
వేసవి క్రీడా శిక్షణ  తరగతులు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ క్రీడలను జోనల్ వారీగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జోనల్ పరిధిలో  మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటుగా  మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు,  కార్పొరేటర్లు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

ఖైరతాబాద్ జోన్ లో  ఈ నెల 25వ తేదీన ఉదయం 7 గంటలకు విక్టరీ ప్లే గ్రౌండ్ లో మేయర్  ప్రారంభిస్తారు. చార్మినార్ జోన్ లో 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు కులీ కుతుబ్ షా స్టేడియం, 27వ తేదీన  ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్  జోన్ లో మారెడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో  కూకట్ పల్లి, శేరీలింగం పల్లి జోనల్ పరిధిలో పిజేఆర్  చందానగర్  స్పోర్ట్స్ కాంప్లెక్స్,  సాయంత్రం 4 గంటలకు,  ఎల్బి నగర్ జోన్లో ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు మేయర్ తో  పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలిసి వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదే విధంగా ముగింపు సమావేశంలో కూడా మేయర్ పాల్గొని  ప్రశంస పత్రాలు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి  అందజేస్తారు.
 
 
 *రూ. 1.20 కోట్ల విలువ గల స్పోర్ట్స్ మెటీరియల్*
 
 
  కోవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాల తర్వాత ఈ వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాలు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ యేడు ఎక్కువ సంఖ్యలో  పాల్గొంటారనే ఉద్దేశ్యంతో  44 క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ మెటీరియల్స్ సిద్దం చేసారు. అనుభవజ్ఞులైన కోచ్ లు సీనియర్ క్రీడాకారులు  800 మంది ని సిద్ధం చేశారు. వీరికి ఎలాంటి  పారితోషికం చెల్లించబడదు. ఈ నేపథ్యంలో సర్కిల్ వారీగా  ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్ నిర్వహిస్తారు.

 ఈ నేపథ్యం లో  క్రీడా నైపుణ్యాన్ని  గుర్తించి వారికి  జిఎంహెచ్సి అధ్వర్యంలో రెగ్యులర్ గా  ఆసక్తి ఉన్న క్రీడలలో పూర్తిగా శిక్షణ కల్పించి వారిని, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్ లో పాల్గొనే విధంగా తయారు చేయడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here