డ్రోన్ల ద్వారా నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తి
హైదరాబాద్, నవంబర్ 11: సాంకేతిక పరిజ్ఞానంతో నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు నివారణకు జిహెచ్ఎంసి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అంధించి, తద్వారా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే విధంగా జిహెచ్ఎంసి ప్రత్యేక చొరవ చూపుతున్నది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలోగల చెరువులు, కుంటలు, నీటి నిలువ ప్రదేశాలలో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ దోమల యొక్క లార్వాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగించడం జరుగుతున్నది. చెరువులో ఉండే గుర్రపు డెక్కను తొలగించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు, దోమల పెరుగుదలకు ప్రధాన కారణాలైనా నీటితో నిండిన ప్రదేశాలు, వృక్షసంపద, సేంద్రియ వ్యర్ధాలు ఉన్న చెరువులలో మన్సోనియా, అర్మిజెరిస్, క్యూలెక్స్ వంటి ఇబ్బంది కలిగించే దోమలు చెరువులలో సామూహిక సంతానోత్పత్తికి దోహదపడుతాయి. లార్వా దశలోనే దోమలను నియంత్రించడానికి సమర్థవంతంగా దాడి చేయడం ప్రధానం. జిహెచ్ఎంసిలోని ఎంటమాలాజి శాఖ
ఫీల్డ్ వర్కర్ ల సహాయంతో చెరువుల పై భౌతికంగా రసాయనాలను నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్ ఢిల్లీ వారిచే నిర్ణయంచబడిన మోతాదులో పిచికారి చేయడం జరుగుతున్నది, అయినప్పటికీ కొంత ప్రయోజనం జరగుతున్న అనుకున్న లక్ష్యం చేరడానికి ఎక్కువ సమయం పడుతున్నది.
ముఖ్యంగా గుర్రపు డెక్కను , పూర్తిగా తొలగించే అవకాశం లేకపోవడం చెరువులలో కొన్ని ప్రాంతాలు పిచికారి చేయడానికి అనుకూలంగా లేక పోవడం కొన్ని ప్రదేశాల్లో మాత్రమే రసాయనం పిచికారి చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ అంశాల కారణంగా చెరువుల నుండి దోమల బెడద సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లక్ష్యాన్ని చేరేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది.
ఈ నేపథ్యంలో మురుగు నీరు ఎక్కువ నిలిచే చెరువులను మొదటి విడతగా ఎంపిక చేసి దోమల నివారణకు డ్రోన్లను వినియోగించుకోవడం జరుగుతున్నది.
నగరంలో మొదటగా 30 చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు వాడే రసాయనాన్ని పిచికారి చేయడం జరగుతుంది.
ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకొని నెలకు రెండుసార్లు, అవసరమైనచోట మూడు సార్లు కూడా పిచికారి చేయడం జరుగుతున్నది.
డ్రోన్ల వల్ల ప్రయోజనాలు
సమయం ఆదా, ఎకరం చెరువును కేవలం 10 నిమిషాల్లో పిచికారి చేయవచ్చు. చెరువులోని అన్ని భాగాలకు సులువుగా చేరడం,
చెరువు అంతటా ఏకరితీన పిచికారితో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతుంది.
జిహెచ్ఎంసి పరిధిలో ఆరు జోన్లలో ఒక్కొక్క జోన్ కు ఒక్కటి చొప్పున మొత్తం 6, హెక్సకాప్టర్ డ్రోన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 30 చెరువులకు ఒప్పందం చేసుకోగా మరో 20 చెరువులలో దోమల నివారణకు చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదించారు.
దోమల సమస్య ఎక్కువగా ఉన్న చెరువులు, కుంటలు కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసినది పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ ల ద్వారా రసాయనాన్ని పిచికారి చేసి దోమల లార్వా, పెద్ద దోమల నియంత్రణ చేయడం జరుగుతున్నది.
డ్రోన్ల ద్వారా నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తి
Spread the love